రాష్ట్రీయం

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సజావుగా దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 8: ఈ నెల 21, 22వ తేదీల్లో రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సజావుగా వైకుంఠ ద్వారం దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈ ఓ డాక్టర్ డి. సాంబశివరావు ఆదేశించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ రోజుల్లో దాతలకు సైతం వసతి దర్శన సౌకర్యాలు ఉండబోవని ముందస్తుగా సమాచారం చేరవేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గోవింద మాల భక్తులకు కూడా సాధారణ భక్తుల్లా స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. తిరుమలలో అనుమతి లేకుండా నడుపుతున్న ఉడ్‌సైడ్ హోటల్‌ను అధికారులు మంగళవారం మూసేశారు. తిరుమలలో మూడున్నర దశాబ్దాలుగా గుబ్బా సత్రంలో నడుపుతున్న ఉడ్‌సైడ్ హోటల్‌కు అనుమతులు లేవంటూ అందిన ఫిర్యాదులను పరిశీలించి టిటిడి ఇఓ సాంబశివరావు ఆదేశాల మేరకు మంగళవారం రెవెన్యూ అధికారులు మూసివేశారు. అన్నదానం చేస్తామని గుబ్బాసత్రం నిర్వాహకుల వద్ద హోటల్ యజమాని కృష్ణ్భట్ తీసుకున్నారు. కొంతకాలం అన్నదానం నిర్వహించిన అనంతరం హోటల్ వ్యాపారం ప్రారంభించారు. గత మూడున్నర దశాబ్దంగా వ్యాపారం సాగించారు.