రాష్ట్రీయం

జలమేగా అభివృద్ధికి మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 23: ‘నీరు అందుబాటులో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పరిశ్రమలు వస్తాయి. ఫలితంగా అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వాన నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోగలిగితే భవిష్యత్తు బంగారమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ప్రజలను కార్యోన్ముఖులను చేసే కార్యక్రమానికి ‘నీరు - ప్రగతి’ అని పేరు పెట్టామన్నారు. రైతులు అయిదెకరాల పొలంలో ఒక పంట కుంటను తవ్వాలని, ఇళ్లల్లోనూ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం సిఎం విస్తృతంగా పర్యటించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అక్కడ పనుల తీరును సమీక్షించారు. పెదవేగి మండలం ముండూరు చేరుకుని పోలవరం కుడికాలువ పనులను పరిశీలించారు. 20కిలోమీటర్ల మేర కారులో ప్రయాణించి పనులను స్వయంగా పరిశీలించారు. వంగూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించిన నీరు-చెట్టు కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లాలో కూడా భూగర్భ జలాలు 19.3 మీటర్లకు పడిపోయాయంటే ముంచుకొస్తున్న ప్రమాదం ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. నిర్ధిష్ట గడువులోగా పూర్తిచేస్తామని బాబు ప్రకటించారు. రాష్ట్రంలో సమస్యలను అధిగమించి అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తుంటే వైసిపి పార్టీ అన్నింటికీ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.పట్టిసీమ పధకం మొదలు పెడితే, ఉభయగోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టడానికి విఫలయత్నం చేశారన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు భూములిస్తే వారిని రెచ్చగొట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తామే చెప్పామని, అయినప్పటికీ రిజర్వేషన్లు కల్పించాలంటూ కొంతమంది ఉద్యమానికి దిగడం, చివరకు ఇది ఒక రైలును, పోలీస్‌స్టేషన్‌ను, భారీ సంఖ్యలో వాహనాలను దగ్ధం చేసే స్థితికి వెళ్లడం దుర్మార్గమన్నారు. ఉచిత ఇసుక విధానంలో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, పిడి చట్టం ప్రయోగించాలని ఆదేశించామన్నారు.

చిత్రం వంగూరులో జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు