రాష్ట్రీయం

ఘన వ్యర్థాల నిర్వహణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రంలో ఎన్నో రకాల కష్టాలున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలూ కృషి చేయడం వల్ల పంచాయతీలను స్వయం సమృద్ధి సాధించే దిశలో ముందడుగు వేశామని పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోమవారం సచివాలయంలో చెప్పారు. పంచాయతీల్లో ఘనవ్యర్ధాల నిర్వహణకు సమగ్ర ప్రణాళికను తయారుచేసి అమలుచేయడం ప్రారంభం అయిందని చెప్పారు. 111 కోట్లతో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 659 పంచాయతీల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలుచేస్తామని చెప్పారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆదాయం 220 కోట్లు మాత్రమేనని, ఈ మొత్తాన్ని తొలి ఏడాదిలోనే 400 కోట్లకు పెంచామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని 600 కోట్లకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. పంచాయతీలను పటిష్టం చేస్తూనే మరో పక్క వివిధ అంశాల్లో అభివృద్ధి సాధించేలా కార్యక్రమాలను అమలుచేస్తున్నామని తెలిపారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువ భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేయడానికి నిర్ధిష్ట ప్రణాళికలు ప్రతి పంచాయతీ తయారుచేసుకనే ముందుకు సాగుతున్నాయని అన్నారు.