రాష్ట్రీయం

నిధులే ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో నడుస్తున్నాయని, ఇప్పటివరకు రూ.1458కోట్లు ఖర్చు పెట్టామని, తక్షణమే రూ.500కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం నిధుల కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతానన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు వచ్చే ఏడాదికి రూ.1600 కోట్లు అవసరమని అన్నారు. ఒక్కరోజు ప్రాజె క్టు పనులు నిలిపితే రూ.3కోట్లు నష్టం వస్తుందని అన్నారు. నీరు-చెట్టు, పంట సంజీవిని కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కడపజిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రామాపురం మండలం గంగనేరు వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లెలకు తాగునీరు, సాగునీరు అందించే వెలిగల్లు ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నందున, సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టు లో పెడుతున్నామన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో శ్రీనివాసపురం, వెలిగల్లు ప్రాజెక్టులకు వచ్చే ఏడాదిలోపు హంద్రీ-నీవా సుజలస్రవంతి, గాలేరు-నగరి నీటిని మొదటిదశ కింద తెప్పిం చి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తెచ్చి కర్నూలు, కడప జిల్లాల్లో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని అన్నా రు. పోలవరం ప్రాజెక్టును గడువులోపలే పూర్తి చేసి 2018 నాటికి రైతులకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో విదేశాల నుంచి యంత్రాలు తెప్పించామని సిఎం తెలిపారు. ఆ యంత్రాలు ఒకరోజు పని నిలిపితే 3కోట్లరూపాయల నష్టం వస్తుందని, దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎదురుచూడకుండా తాత్కాలికంగా సర్దుబాటు చేస్తూ పనులు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలో పెన్నా, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామని సిఎం పేర్కొన్నారు. నదుల అనుసంధానం వల్ల నీటి కొరత తగ్గుతుందని అన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో రోజుకో రంగు బెడ్‌షీట్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ బెడ్‌షీట్లు మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం 7 రోజులకు ఏడు రంగుల్లో బెడ్‌షీట్లు ఇస్తున్నట్టు సిఎం చెప్పారు. గాడితప్పిన యంత్రాంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నానని ఆయన తెలిపారు.

చిత్రం కడప జిల్లా రామాపురం మండలం బిల్లిగుట్ట చెరువులో పొక్లైన్‌తో మట్టి తీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు