రాష్ట్రీయం

ఓయూలో హై టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ తార్నాక/ నాచారం, డిసెంబర్ 9: ఉస్మానియా వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ టెన్షన్ కనిపిస్తోంది. ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ప్రకటిస్తే, కింది కోర్టు ఇచ్చిన స్టేటస్‌కో తీర్పును కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత విద్యతోపాటు పరిశోధనలు జరిపే వర్శిటీలో పెదకూర, పంది మాంసం, బోటి కూర పండగల నిర్వహణను వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై హైకోర్టు పైవిధంగా ఆదేశాలిచ్చింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి రాకపోవడంతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితులు చేజారకుండా ఓయూను 500మంది పోలీసులు 50 వాహనాలతో చుట్టుముట్టారు. కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పండగల నిర్వాహకులనూ అరెస్టు చేసేందుకు సిద్ధంగావున్నారు. కాగా ఏసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు ఓయునుంచి బయటకురాకుండా, పోలీసులను హాస్టళ్లలోకి రానివ్వరాకుండా లోపలినుంచి విద్యార్థులు తాళాలు వేసుకున్నారు.
పండగ ఆపేదిలేదు: స్టాలిన్
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలాంటి పండుగలైనా చేసుకునే హక్కు అందరికీ ఉందని, పండుగలను ఆపడం సమంజసంకాదని బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు బి స్టాలిన్, శంకర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై తమకు సమాచారం లేదన్నారు. ఒకవేళ తీర్పువచ్చినా తాము కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. కోర్టు తీర్పులో ప్రతివాదిగా పేర్కొన్న వ్యక్తి ఓయూలో లేరన్నారు. విద్యార్థులంతా కలసి ప్రశాంతంగా జరుపుకునే పండగను కొందరు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, విద్యార్థి సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఫ్ ఫెస్టివల్ జరిపి తీరుతామన్నారు. ఇదిలావుంటే, ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే అదే సమయానికి టాంక్‌బండ్ వద్ద గోపూజ, ఇందిరాపార్కు వద్ద గోరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సిద్ధమయ్యారు. దీంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయోనని ఓయూలోని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ బీఫ్ ఫెస్టివల్‌పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. తీర్పును అమలుపర్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. గురువారం ఉదయం టాంక్‌బండ్ వద్ద నిర్వహించనున్న గోపూజకు స్వామి పరిపూర్ణానంద హాజరవుతారన్నారు.
రాజకీయం వద్దు:పురుషోత్తం
ఉస్మానియా వర్శిటీలో జంతు మాంసంపై రాజకీయం చేయొద్దని దళిత విద్యార్థి సంఘం అధ్యక్షుడు పురుషోత్తం సూచించారు. ఉన్నత విద్య అభ్యసించే వర్శిటీలో పండగల పేరిట ఉత్సవాలు తగదన్నారు. కొందరు నేతలు రాజకీయ స్వార్థంతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు.
ఉత్తర్వులు ధిక్కరిస్తే అడ్మిషన్లు రద్దు
బీఫ్ ఫెస్టివల్‌కు అనుమతిలేదని రిజిస్ట్రార్ సురేష్‌కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును ధిక్కరిస్తే అడ్మిషన్లు రద్దు చేస్తామని రిజిస్ట్రార్ హెచ్చరించారు. కోర్టు ఆదేశాల మేరకు బీఫ్ ఫెస్టివల్ జరగకుండా చూస్తామన్నారు. ఇదిలావుంటే నగరంలో పండుగల పేరిట శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ నగరంలో పండుగలు, బహిరంగ సభలను నిషేధించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 144వ సెక్షన్ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు.

చిత్రం.. (1) వర్శిటీలో మోహరించిన పోలీస్ బలగాలు
(2) బీఫ్ ఫెస్టివల్‌కు అనుకూలంగా నినాదాలిస్తున్న విద్యార్థులు