రాష్ట్రీయం

నమ్మకం లేకుంటే తప్పుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: తాను పార్టీ మారుతున్నట్లు పార్టీ నేతలే దుష్ప్రచారం చేయడాన్ని సీ ఎల్పీనేత కే.జానారెడ్డి ఖండించారు. తనపై నమ్మకం లేకపోతే సిఎల్‌పి పదవి నుంచి తప్పుకుంటానని కూడా ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ సిఎల్‌పి కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగే తీరుకు నిరసనగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తాను కాంగ్రెస్‌లో కొనసాగుతానన్నారు. పార్టీలో విబేధాలు ఉంటే పరిష్కరించుకుందామని, కెసిఆర్ ప్రభుత్వ ప్రజ్యావతిరేక విధానాలపై అసెంబ్లీ లోపల, వెలుపల పోరాడుదామన్నారు. కాగా ఈ సమావేశానికి హాజరైన డికె అరుణ, గీతారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్‌లు సిఎల్‌పి నేతగా జానారెడ్డి కొనసాగాలని కోరారు. జానారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పాలేరు ఉప ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి విరాళంగా ఇవ్వాలని తెలంగాణ సిఎల్‌పి నిర్ణయించింది.