రాష్ట్రీయం

‘నీట్’పై సవాలుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సంబంధించి తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని సుప్రీంకోర్టు శనివారం మరో మారు స్పష్టంగా చెప్పినా, రానున్న రోజుల్లో విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకుంటుందనే ఆశాభావాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క నీట్ తొలి దశ పరీక్ష పూర్తికాగానే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ఎమ్సెట్ పూర్తయిందని, దానికి ఎలాంటి ఢోకా ఉండబోదని అధికారులు చెబుతున్నారు. మరో పక్క రానున్న రోజుల్లో నీట్‌కు సంబంధించి వందలాది పిటిషన్లు సుప్రీంకోర్టులో నమోదయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో అనివార్యంగా సుప్రీంకోర్టు విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో దశ పరీక్షకు అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఈ దశలో చెప్పలేమని, సమగ్ర మార్గదర్శకాలు రానిదే రెండో దశ నీట్‌పై మాట్లాడలేమని వారు అంటున్నారు. ఒక వేళ 15 శాతం అఖిల భారత కోటా కోసం నీట్ పరీక్షను నిర్వహించినా, రానున్న రోజుల్లో ఎమ్సెట్‌కు ఎలాంటి ఢోకా ఉండదని కూడా వారు పేర్కొంటున్నారు.
నీట్ పరీక్ష రాయాలంటే విద్యార్థులు సన్నద్ధతకు కొంత గడువు కావాలని ప్రధానంగా సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌తో జరిగే ఈ పరీక్షకు స్టేట్ బోర్డు సిలబస్ విద్యార్థులు సిద్ధం కావాలంటే కొంత తర్ఫీదు అవసరమని, అకస్మాత్తుగా వారి ప్రిపరేషన్ మొత్తం గందరగోళంలో పడకుండా ఉంటాలంటే ఎమ్సెట్‌ను కొనసాగించాల్సిందేనని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
శనివారం సవరణ ఆదేశాలను సుప్రీంకోర్టు ఇస్తుందేమోనని భావించిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికిప్పుడు ఎలాంటి సవరణ ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తులు స్పష్టం చేయడంతో నీట్ రెండో దశపై అంతా దృష్టి సారించారు. ఇరు తెలుగు రాష్ట్రాలూ అప్పీలు చేసినా, ఎంత వరకూ సానుకూల ఆదేశాలు వస్తాయో తెలియని అయోమయం నేటికీ నెలకొంది.

రేపటినుంచి కాలేజీల తనిఖీలు

సిద్ధమైన విద్యాశాఖ బృందాలు భద్రతకు విజిలెన్స్ స్క్వాడ్‌లు రికార్డుల గోల్‌మాల్‌పై దృష్టి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలోని వృత్తి సాంకేతిక విద్యా సంస్థలతో పాటు డిగ్రీ, పిజి కాలేజీల్లో ప్రమాణాల నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కాలేజీల యాజమాన్యాలు కాళ్లబేరానికి వచ్చాయి.
సామదాన భేద దండోపాయాలను ప్రయోగించిన యాజమాన్యాలు చివరికి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనిఖీలపై స్టే ఉత్తర్వులు పొందాయి. అయితే వెనువెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలను నెలకొల్పాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనంటూ హైకోర్టును ఆశ్రయించి ఆమోదం పొందింది. వాస్తవానికి గురువారం నుండి ప్రారంభం కావల్సిన తనిఖీలు, న్యాయవివాదాలతో మూడు రోజుల పాటు జాప్యం జరిగింది. సోమవారం నుంచి ఈ తనిఖీలు ప్రారంభం అవుతాయి. తాజాగా విద్యాశాఖకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిధిలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు విజిలెన్స్, పోలీసు శాఖలకు చెందిన అధికారులతో తనిఖీ బృందాలు సిద్ధమయ్యాయి.
ఈ బృందాలు కాలేజీలకు సంబంధించి ఎఐసిటిఇ రూపొందించిన సెల్ఫ్ అప్రైజల్ (స్వీయ సమీక్షా నివేదికలు)ను పరిశీలిస్తాయి. సెల్ఫ్ అప్రైజల్‌లో ఇచ్చిన వివరాలు, క్షేత్ర స్థాయిలో వాస్తవిక స్థితిని పరిశీలిస్తారు. ప్రధానంగా సొంత భవనాలు, భూమి, తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్‌లు, సిబ్బంది విద్యార్థులకు వేర్వేరుగా సౌకర్యాలు, కాషన్ డిపాజిట్ వివరాలు, అటెండెన్స్ రిజిస్టర్లు, రెగ్యులర్, మేనేజిమెంట్ కోటా అడ్మిషన్ల వివరాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను ఈ బృందాలు పరిశీలిస్తాయి. నేరుగా ఈ బృందాలు ఉన్నత విద్యామండలికి నివేదికలు ఇస్తాయి. ఆ నివేదికలను మండలి అధికారులు ప్రభుత్వానికి, యూనివర్శిటీకి పంపిస్తారు. లోపాలు ఉన్నట్టు తేలిన విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు విద్యాసంస్థలకు కొంత గడువు ఇస్తారు. మరో పక్క ప్రభుత్వ డిగ్రీ, పిజి కాలేజీలతో పాటు జూనియర్ కాలేజీల్లో సౌకర్యాల పెంపునకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మరో పక్క కొత్త భవనాలకు, ఇతర వౌలిక సదుపాయాలకు ఇప్పటికే నిధులను కేటాయించింది. కాగా రానున్న రోజుల్లో ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు. ప్రైవేటు కాలేజీల్లో మున్ముందు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని పేర్కొన్నారు.
ఇప్పటికే వివిధ ప్రవేశపరీక్షలకు ప్రైవేటు కేంద్రాల్లో హాల్‌టిక్కెట్లు జారీ అయి ఉంటే వారందరికీ ప్రభుత్వ కాలేజీల్లో కేంద్రాలు కేటాయిస్తూ హాల్‌టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.

రైతులకు అన్యాయం జరగనివ్వం

మంత్రి దేవినేని ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 30: కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వమని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కోర్టు, ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించి మన వాటా నీటిని దక్కించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షనేత జగన్‌కు లేదనన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం నిర్వహించిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, కృష్ణాజలాల అంశం ట్రిబ్యునల్‌లో ఉందని గుర్తుచేశారు. మన వాదనలు బలంగా వినిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నాటక, మహారాష్టల్రో వర్షాభావం వల్ల శ్రీశైలానికి 850 టిఎంసి నీరు చేరాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం 66 టిఎంసిలు మాత్రమే వచ్చాయన్నారు. 10 శాతం కన్నా తక్కువ నీరు వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి కొంత నీరు రాష్ట్రానికి తరలించామని మంత్రి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో 2018 నాటికి పూర్తి చేస్తామని ఉమా స్పష్టం చేశారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యలు తీసుకుంటున్నారని, అయితే ప్రాజెక్టులను సిఎం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షనేత దీక్ష చేస్తాననడం సరికాదన్నారు. పోలవరం గురించి మాట్లాడే నైతికహక్కు జగన్‌కు లేదన్నారు. వైఎస్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.10 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్లకు పెంచారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకునే అంచనాలను సవరించామని వెల్లడించారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును కేంద్రమంత్రి ఉమాభారతి అభినందించారని అన్నారు. తెలంగాణతో సఖ్యతగా మెలిగి నీరు తెచ్చుకోవడం ప్రతిపక్ష నేతకు మింగుడుపడటం లేదని ఆరోపించారు. ప్రతిపక్షనేత అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాలుల ఖాళీ చేసేందుకు సహకరించకపోగా, అక్కడి వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఉమా విమర్శించారు.