రాష్ట్రీయం

కార్మికులకు ప్రత్యేక బ్యాంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: కార్మికుల కోసం ప్రత్యేకంగా బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించామని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇపిఎఫ్ వడ్డీ రేటును 8.8 శాతంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సిఫార్సును నిర్ధారించి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి పంపించామని ఆయన తెలిపారు. కార్మికుల కష్టార్జితాన్ని భద్రం గా భవిష్య నిధిలో ఉంచామని, తమ వద్ద ప్రస్తుతం 3,30,312.88 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆయన వివరించారు. ఒక ఉద్యోగి, ఒకే ఇపిఎఫ్‌ను (యూనివర్సల్ అకౌంట్ నెం బర్) అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్మికుల సంక్షే మం కోసం ఇపిఎఫ్ చట్టాన్ని సవరిస్తామని, అసంఘటిత రంగ కార్మికులను ఇపిఎఫ్ పరిధిలోకి తెస్తామని ఆయన చెప్పారు. కార్మిక శాఖ, ఆర్థిక శాఖల మధ్య సమన్వయం కొరవడిందన్న వాదనను దత్తాత్రేయ తోసిపుచ్చారు. రాజకీయాలకు అతీతంగా కార్మికులు కలిసి ఉండాలని ఆయన సూచించారు. అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. అగస్టా కుంభకోణం లావాదేవీలు బహిర్గతం కావాలని ఆయన అన్నారు. అగస్టా కుంభకోణంలో పెద్ద వాళ్ళు ఇరుక్కున్నారని కాంగ్రెస్ చింతిస్తున్నట్లుగా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్రాల స్పీకర్ల భేటీ

మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 30: అసెంబ్లీ ఉద్యోగుల విభజన అంశంపై తెలుగు రాష్ట్రాల కౌన్సిల్ చైర్మన్లు, అసెంబ్లీ స్పీకర్లు శనివారం సమావేశమై చర్చించారు.
అసెంబ్లీ కమిటీ హాలులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనా చారి, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ ఎ.స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, కౌన్సిల్ చైర్మన్ ఎ.చక్రపాణి, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజాసదారామ్, ఎపి అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ రావు సమావేశమయ్యారు. అయితే టి.కౌన్సిల్ చైర్మన్ ఎ.స్వామిగౌడ్ కల్పించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేకుండా ఏమని చర్చిస్తామని అన్నారు. స్వామిగౌడ్ అభిప్రాయంతో మిగతా వారూ ఏకీభవించారు. దీంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించి, సమావేశాన్ని వాయిదా వేశారు.

అసెంబ్లీ ఉద్యోగుల విభజన అంశంపై శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన తెలంగాణ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి,
శాసనమండలి చైర్మన్ ఎ.స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తదితరులు

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్‌పర్సన్‌గా
బాధ్యతలు స్వీకరించిన గీతారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్‌పర్సన్‌గా జె. గీతారెడ్డి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ సమావేశానికి స్పీకర్ ఎస్. మధుసూదనా చారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (టిఆర్‌ఎస్), డాక్టర్ కె. లక్ష్మణ్ (బిజెపి), టి. జీవన్ రెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్సీ రాములు నాయక్ (టిఆర్‌ఎస్) తదితరులు హాజరయ్యారు.