రాష్ట్రీయం

అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ పేరుతో ఒక బృహత్ ప్రణాళికను రూపొందించింది.
ఇప్పటికీ వెలుగులోకి రాని అన్నమయ్య కీర్తనలను వెలికితీసి ప్రజలకు అందించాలన్నదే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. ఈ ప్రణాళిక విధివిధానాల గురించి తితిదే చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి.సాంబశివరావు శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధులకు వివరించారు. హైదరబాద్‌లోని శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్‌విబిసి) కార్యాలయంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ పదకవితా పితామహుడు అన్నమాచార్యులు శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ 32 వేల కీర్తనలు రాయగా, అందులో 14 వేల కీర్తనలు మాత్రమే లభించాయన్నారు. ఇప్పటి వరకు రెండువేల సంకీర్తనలకు మాత్రమే బాణీలు కట్టారని, మిగతా కీర్తనలకు బాణీలు కట్టి ప్రజలకు అందించాలన్న ప్రయత్నమే అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్‌విబిసి 2016 మే 21 నుండి టెలికాస్ట్ చేస్తుందన్నారు. ప్రతి శనివారం, ఆదివారం రోజూ రెండుగంటల పాటు ప్రసారాలు ఉంటాయన్నారు. 26 వారాలపాటు 52 ఎపిసోడ్‌లు ప్రసారమవుతాయని కృష్ణమూర్తి వివరించారు. అన్నమయ్య కీర్తనల మీద విశేషంగా కృషి చేసిన గాయనీగాయకులు, సంగీత దర్శకులు, రచయితలు తదితరులు ఎస్‌విబిసిలో ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్‌లో భాగస్వాములు అవుతారని వివరించారు.
తితిదే పాలక మండలి సభ్యుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు నేతృత్వంలో ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి సారథ్యంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటోందని తితిదే చైర్మన్ పేర్కొన్నారు. ప్రముఖ గాయని సునీత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం కార్యక్రమంలో 50 మంది గాయకులు పాల్గొంటున్నారని వివరించారు.
మారుమూల ప్రాంతాలకు..
తితిదేవస్థానాలు చేపట్టిన ధర్మప్రచార కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు కూడా చేర్చాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి. సాంబశివరావు పేర్కొన్నారు. ఎస్‌విబిసిని స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని, అలాగే ఈ చానల్ కార్యక్రమాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. ప్రస్తుతం అన్నమయ్య కీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టగా, భవిష్యత్తులో ఇతర రంగాలకు చెందిన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు. అన్నమయ్య పాటలకు పట్ట్భాషేకంలో 500 పాటలకు స్వరకల్పన చేస్తామని వివరించారు. ఎస్‌విబిసి రూపొందించే కార్యక్రమాలను ఇతర చానళ్లు కూడా వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ఎస్‌విబిసి ఆదాయపరంగా స్వయం సమృద్ధి సాధించేలా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, ఎంఎం కిరవాణి, ప్రముఖ గా యని సునీత తదితరులు మాట్లాడారు.