రాష్ట్రీయం

పెద్ద శేషునిపై వైకుంఠ నాథుడై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 9: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవరోజైన బుధవారం ఉదయం పెద్దశేష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. ఉదయం 8 గంటలకు అమ్మవారు పెద్ద శేషవాహనంలో వైకుంఠ నాథుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. బుధవారం ఉదయం నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత వాహన మండపానికి తీసుకువచ్చి అక్కడ పట్టుపీతాంబరాలు, వజ్రవైఢూర్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం భక్తుల కోలాటాలు, దాస సాహితి, భజన బృందాలు, కేరళ చండీ వాయిద్యాలు, నాదస్వర మేళతాళాలు, జియ్యం గార్ స్వాముల ప్రబంధ పారాయణ సాగగా పెద్దశేషుడిపై అమ్మవారి చిద్విలాసంగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కాగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం రాత్రి హంస వాహనంపై వీణాపాణియై శారదాంబగా అలిమేలు మంగమ్మ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అనంతమైన విజ్ఞానాన్ని ప్రసాదించారు.

తిరుచానూరు మాడ వీధుల్లో బుధవారం ఉదయం
పెద్ద శేషవాహనంపై విహరిస్తున్న శ్రీ పద్మావతీ అమ్మవారు

రాష్టప్రతి రాకకు భారీ ఏర్పాట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 9: ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ మిలటరీ కళాశాల (ఎంసిఇఎంఇ)లో ఈ నెల 19న జరగనున్న సదస్సులో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 1946లో ఎంసిఇఎంఇ ప్రారంభించిన తర్వాత మొదటిసారి రాష్టప్రతి వస్తున్నందున ఆ రోజు చరిత్రలో నిలిచిపోతుందని మిలటరీ అధికారులు అంటున్నారు. రాష్టప్రతి రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంసిఇఎంఇ కళాశాల అనేక సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ప్రాథమిక శిక్షణా ఇనిస్టిట్యూట్‌గా ఎంతో అభివృద్ధి చెందింది. లోగడ ఈ కళాశాలకు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు లభించింది. విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలకు ప్రధాన మంత్రి అత్యుత్తమ అవార్డు పొందింది. ఈ కళాశాల జెఎన్‌టియు, జెఎన్‌యుకు అనుబంధంగా ఉంది.
ఎంసిఇఎంఇ ప్రస్తుత కమాండెంట్ లెఫ్ట్‌నెంట్ జనరల్ గురుముఖ్ సింగ్ ఇఎంఇ కల్నల్ కమాండెంట్‌గా కూడా ఉన్నారు. సదస్సు సందర్భంగా రాష్టప్రతి చేతుల మీదుగా 22 మంది డిగ్రీ ఇంజనీరింగ్ (డిఇ-96) అధికారులు, 40 మంది టెక్నికల్ ఎంట్రీ స్కీం (టిఇఎస్-24) అధికారులు పట్టాలు అందుకోనున్నారు.

రాష్టప్రతి రాక సందర్భంగా ఎంసిఇఎంఇలో బుధవారం ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిలటరీ అధికారులు