రాష్ట్రీయం

కేంద్రంతో జగడం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం నెమ్మదిగా మబ్బులను తొలగిస్తోంది. ప్రత్యేక హోదా ఆలోచనే కేంద్రానికి లేదని, అందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సామదాన భేద దండోపాయాలను ప్రయోగించినా అనుకున్న ఆశయం నెరవేరకపోవడంతో కేంద్రాన్ని దారికి తేచ్చే మార్గాలను అనే్వషిస్తున్నారు. కేంద్రానికి మద్దతు కొనసాగిస్తూనే మంత్రివర్గం నుండి మాత్రం టిడిపి తప్పుకోవడమే ఈ దశలో ఉత్తమమైనదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుండగా, దానికి సిఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రం లో విస్తృతమైన చర్చ గత రెండేళ్లలో జరిగింది. సమయం వచ్చిన ప్రతిసారీ కేంద్ర మంత్రులు కూడా ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, కేంద్రం తిరస్కరించలేదని కూడా చెబుతూ వచ్చారు. తీరా అసలు విషయానికి వచ్చేసరికి కేంద్రం చేతులు ఎత్తేయడాన్ని టిడిపి జీర్ణం చేసుకోలేకపోతోంది. ప్రధానిని కలిసిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై ప్రస్తావన చేయడమేగాక, అసెంబ్లీలో కూడా ఇందుకు తీర్మానం చేశారు. ప్రధానికి చంద్రబాబు అనేక మార్లు లేఖలు రాశారు, కేంద్ర మంత్రులు నేరుగా ప్రధానిని కలిసి ఈ అంశంపై ప్రస్తావించినా పని జరగకపోవడంపై టిడిపి కింకర్తవ్యంలో పడిపోయింది. రాష్ట్ర క్యాబినెట్‌లో బిజెపి మంత్రులను కొనసాగించినా, కేంద్రంలోని క్యాబినెట్ నుండి మంత్రులను తప్పించడం తుది ప్రత్యామ్నాయంగా యోచిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు మంత్రులున్నారు. అందులో ఇద్దరు తెలుగు దేశం పార్టీ వారు కాగా, మరో ముగ్గురు బిజెపికి చెందిన వారు. ఎం వెంకయ్యనాయుడు, పి అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, వై ఎస్ చౌదరి మంత్రులుగా ఉన్నారు. వీరిలో పి అశోక్ గజపతి రాజును, వైఎస్ చౌదరిని మంత్రిపదవుల నుండి రాజీనామా చేయించడం ద్వారా రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. మరో పక్క రాష్ట్రంలోనూ బిజెపి మంత్రులు మంత్రివర్గం నుండి తప్పుకుంటే వారిస్థానంలో ఇటీవల పార్టీలో చేరిన కొత్తవారిని మంత్రిపదవుల్లోకి తీసుకోవాలని టిడిపి నేతలు చెబుతున్నారు.
రెండేళ్లుగా ప్రత్యేక హోదాను ఊరిస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం ఇపుడు మాట మార్చి అవసరమైన మేర ఆర్ధిక సాయం చేస్తామని, ప్రత్యేక హోదా అవసరం లేదనడంతో ఈ అంశంపై విపక్షం చేసే రచ్చపై టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో హోం శాఖ సహాయ మంత్రి హరీభాయి చౌదరి చూచాయిగా చెప్పగా, అలాంటి ఆలోచన కేంద్రం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేయడంతో టిడిపి ఇరకాటంలో పడింది.
సాధారణ సాయం, అదనపు సాయం , ప్రత్యేక సాయం పేరిట కేంద్రం సహాయం అందిస్తుంది, అదే ప్రత్యేక కేటగిరి పొందితే 30 శాతం అదనపు నిధులు లభిస్తాయి. అందులోనూ 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్ కాగా, 10 శాతం అప్పుగా అందుతుంది. ప్రత్యేక హోదా దక్కితే పెద్ద ఎత్తున గ్రాంట్‌లు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఆశించింది. కొత్త రాజధాని నిర్మాణం, ఉద్యోగులు- జీతభత్యాలు, కొత్త ప్రాజెక్టులు, జాతీయ సంస్థల ఏర్పాటు, వౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామిక వాడల ఏర్పాటుతో పాటు రవాణా సౌకర్యాల కల్పన, ఎయిర్‌పోర్టుల ఏర్పాటు , ఉపాధి అంశాలపై ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించాల్సిన తరుణంలో ప్రత్యేక హోదా కలిసివస్తుందని రాష్ట్రం భావించింది.
దేశంలో ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అస్సాం, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాలండ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్, బీహార్ , జార్కాండ్, ఒడిస్సా, రాజస్థాన్, ఛత్తీస్‌ఘ్ఢ్ సహా పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి.