తెలంగాణ

బెబ్బులిని రెచ్చగొట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటుక విసిరితే రాయతో కొడతాం నీళ్ల కోసమే అయతే గోదావరి పుష్కలం
వాడుకునే తెలివి, దమ్ముంటే తీసుకోండి కుళ్లు రాజకీయాలతో చిచ్చు పెట్టకండి
మీ ఇద్దరి సంగతీ మాకు తెలుసు బాబు, జగన్‌పై సిఎం కెసిఆర్ నిప్పులు

కుళ్లు రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి. మీరు చేసే గోల నీళ్ల కోసమైతే, గోదావరిలో పుష్కలంగా ఉన్నాయి. వాటిని వాడుకునే తెలివి, తీసుకునే దమ్ముంటే సహకరిస్తాం. గిల్లి కజ్జాలతో పడుకున్న పులిని నిద్రలేపొద్దు.

హైదరాబాద్, మే 4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విరుచుకుపడ్డారు. ‘మీ ఇద్దరి సంగతి నాకు బాగా తెలుసు. రాజకీయ అవసరాల కోసమే అయితే వేరేరకంగా తేల్చుకోండి’ అని కెసిఆర్ హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఖమ్మం ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఆ పార్టీకి చెందిన ఆరు జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు సర్వ స్వతంత్ర రాష్ట్రం. మీ బెదిరింపులు, ఆటలు ఇక ఎంత మాత్రం సాగవు. ఉన్న మర్యాద పోగొట్టుకునేలా వ్యవహరించవద్దన్నారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ ఇద్దరి గురించి బాగా తెలుసు. కడుపులో కత్తి పెట్టుకుని బయటికి చిల్లర రాజకీయాలు చేస్తామంటే చెల్లవుకాక చెల్లవు అని కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఆరు నూరైనా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు వచ్చి తీరాలి. పొరుగు రాష్ట్రాలతో గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. అయితే ఆంధ్రలో రాజకీయ ఆధిపత్యం కోసం, చిల్లర మల్లర రాజకీయాల కోసం మా మీద యుద్ధం చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని కెసిఆర్ హెచ్చరించారు. మా దారి మాదే. ఇలాగే కుళ్లు కుత్సిత కుతంత్రాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తే ఎంతకైనా తెగిస్తాం, తస్మాత్ జాగ్రత్త అని కెసిఆర్ హెచ్చరించారు. ‘అమరావతికి వెళ్లిన సందర్భంగా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పాను. గోదావరి నది నుంచి 3 నుంచి 4 వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. వాటిని తెలంగాణ వాడుకున్న తర్వాత కూడా చాలా మటుకు మిగులు జలాలు ఉంటాయి. వాటిని వాడుకోమ్మని చెప్పాను’ అని కెసిఆర్ వివరించారు. ఈ విషయం చాటు మాటున చెప్పలేదు. శాసనసభ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా లెక్కలతో సహా వివరించానన్నారు. గోదావరి నుంచి నీటిని తెలంగాణ వాడుకోవాలంటే 5 వందల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లాలి. అదే ఆంధ్రకు అయితే వంద, నూటయాభై మీటర్ల ఎత్తుతోనే తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చంద్రబాబుకు చెప్పానన్నారు. రాష్ట్రం వచ్చింది మా బతుకేదో మేము బతుకుతామంటే రెచ్చగొట్టాలని చూస్తున్నారని సిఎం ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో శాసనసభ సాక్షిగా చెప్పిన లెక్క ప్రకారమే కృష్ణానదిలో 368 టిఎంసిలు, గోదావరిలో 958 టిఎంసిల నీటిని తెలంగాణ వాడుకోవచ్చని సిఎం గుర్తు చేశారు. ఆ మేరకే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. మాకు పౌరుషం ఉంది. తెలంగాణ బిడ్డలు తిరగబడే పరిస్థితి కల్పించవద్దని కెసిఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఆరు నూరైనా కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి తీరాల్సిందే. వందశాతం తీసుకెళ్తాం కూడా అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.