రాష్ట్రీయం

మూసుకుపోయిన ధమనికి స్ట్రింగ్ రే పరికరంతో చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఒక వ్యక్తికి గుండెలో వంద శాతం మూసుకుపోయిన ధమనికి (క్రానిక్ టోటల్ అక్లూజన్) ‘క్రాస్ బాస్, స్ట్రింగ్‌రే’ పరికరాన్ని ఉపయోగించి హైదర్‌గుడాలోని అపోలో ఆసుపత్రి డాక్టర్లు విజయవంతంగా చికిత్స చేశారు. ఇలాంటి చికిత్స జరగడం దేశంలో ఇదే మొదటిసారని అపోలో డాక్టర్లు చెప్పారు. దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యక్తికి తాము ఈ పద్ధతిలో విజయవంతంగా చికిత్స చేశామని కార్డియాలజిస్టులు డాక్టర్ వి. సూర్యప్రకాశ్ రావు(హెచ్‌వోడి-కార్డియాలజీ), డాక్టర్ పిఎల్‌ఎన్ కపర్థి (డైరెక్టర్, క్యాథ్‌ల్యాబ్ సర్వీసెస్) బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ చికిత్సా విధానంలో మూసుకుపోయిన ధమనికి ఛానల్ ద్వారా బెలూన్‌ను అమర్చి, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్‌తో ధమనిని తెరవడం జరుగుతుందని వారు చెప్పారు. ఈ చికిత్సకు ఒకటిన్నర నుంచి రెండు గంటల వ్యవథి పడుతుందని అన్నారు. చికిత్స చేయించుకున్న రోగిని 48 గంటల్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని, చికిత్సలో ఎటువంటి కుట్లు ఉండవని వారు వివరించారు. వంద శాతం మూసుకునిపోయిన ధమనిని డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్‌తో తెరిచే సాంకేతికతను జపాన్‌లో అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు.

యాగస్థలాన్ని
పరిశీలించిన కలెక్టర్
జగదేవ్‌పూర్, డిసెంబర్ 9: మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ఎర్రవల్లిలోగల సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌లో ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీ యాగం ఏర్పాట్లును బుధవారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పరిశీలించారు. ఫాంహౌస్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, పార్కింగ్, వసతి సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. యాగానికి వివిధ ప్రముఖులు హాజరవుతున్నందున ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు. యాగానికి హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు జరగాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం ఎర్రవల్లిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఆయన వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, ఎమ్మార్వో అనిల్, ఎంపిడిఓ పట్ట్భా రామారావు, సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.