రాష్ట్రీయం

అదనంగా 30శాతం డిఎ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 7: అమరావతిలో సెక్రటేరియట్ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, మంత్రులకు విల్లాలు అద్దెకు తీసుకోవాలని ముందు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెయిన్ ట్రీ పార్కులో భవనాలు, విల్లాలు లీజుకు తీసుకునే పరిస్థితులులేవు. మంత్రులు విజయవాడ, గుంటూరులో కార్యాలయాలు, నివాసాలు చూసుకుంటున్నారు. అవసరమైతే రెయిన్ ట్రీ పార్కులో విల్లాలు లీజుకు తీసుకుంటారు. ఉద్యోగులకు 30 శాతం అదనంగా డిఏ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గడువులోపు రాజధానికి తరలి రావాల్సిందే అని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో సచివాలయ భవనాలు, ఉద్యోగుల తరలింపు, అమరావతి నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై మంత్రి ఆంధ్రభూమితో ప్రత్యేకంగా మాట్లాడారు. తాత్కాలిక సచివాలయ భవనాలు వచ్చేనెల 15వ తేదీకల్లా మొదటి అంతస్తువరకు పూర్తిచేసి అందిస్తామని ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ప్రకటించాయి. వచ్చేనెల 27వ తేదీ నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రాజధానికి తరలించేందుకు ముహూర్తం నిర్ణయించామని, ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. సచివాలయంలో మరో రెండు అంతస్తుల నిర్మాణం కూడా పూర్తయ్యాక జూలై, ఆగస్టు నెలల్లో రెండు దశలుగా పూర్తిస్థాయిలో ఉద్యోగులను తరలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. స్థానికత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తొలుత ఐదువేల మంది ఉద్యోగులకు గృహ నిర్మాణం చేపడతామన్నారు. అయితే భూములిచ్చిన రైతులకు ముందుగా ప్లాట్ల కేటాయింపు జరుపుతామని, ఆపై ఉద్యోగుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తామని అన్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు. సీఆర్డీయే నిర్దేశించిన పరిమితి దాటిన స్థలాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలసి విక్రయించుకోవచ్చునని, మిగిలిన ఆ బిట్లపై రైతుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల పదో తేదీ వరకు ప్లాట్ల దరఖాస్తుకు గడువు ఉందని, రైతుల విజ్ఞాపన మేరకు అవసరమైతే మరో నాలుగైదురోజులు పొడిగిస్తామని వెల్లడించారు. గృహ, వాణిజ్య స్థలాల కేటాయింపుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించామని మరింత సమయం కోరితే రాజధాని పనులు ముందుకు సాగవన్నారు. ప్లాట్ల కేటాయింపు పూర్తయితే జూన్‌లో మార్కింగ్ ఇచ్చి జూలైలోగా ప్రక్రియ పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. భూ సమీకరణ రైతులకు ఇప్పటి వరకు రెండో ఏడాది కౌలు చెల్లించక పోవటాన్ని ప్రశ్నించగా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో సామాజిక పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను మంత్రి దృష్టికి తీసుకురాగా ఆధార్ సీడింగ్‌తోనే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని అక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధాని ముఖద్వారం కేంద్రంగా ఏర్పాటుకానున్న యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించామన్నారు. దీనివల్ల కనకదుర్గమ్మ వారధికి ఎలాంటి ఒత్తిడి ఉండబోదని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. యాక్సెస్ రోడ్డు 18 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని ఇందులో 6 కిలోమీటర్లకు, 12 కిలోమీటర్లలో రెండు వంతెనలు కృష్ణానదిపై నిర్మితమవుతాయని, గొల్లపూడి వెంకటపాలెం వద్ద నేరుగా సీడ్ కాపిటల్‌కు వంతెన నిర్మిస్తారని దీనివల్ల రద్దీ ఉండదని వివరించారు. సీడ్ కాపిటల్ నిర్మాణ పనులు జూన్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు జరుపుతున్నారని తెలిపారు.