రాష్ట్రీయం

‘దేశం’ గుండె గుబిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు తెలుగుదేశం పార్టీకి ఇరకాటంగా పరిణమించింది. వచ్చే శుక్రవారం ప్రత్యేక హోదా అంశంపై కెవిపి బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో, తమ పార్టీ పాత్ర ఏమిటన్న దానిపై టిడిపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడిన చంద్రబాబు అందరితో చర్చించి నిర్ణయిద్దామని, కెవిపి ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇస్తే తప్పేమిటన్న కోణంలో మాట్లాడినట్లు సమాచారం. అయితే, ఈ అంశంలో పార్టీనేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సహజంగా ప్రతి శుక్రవారం రాజ్యసభలోప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరుగుతుంటుంది. ఆ క్రమంలో ఇప్పటికే నోటీసు ఇచ్చిన కేవీపీ ప్రతిపాదించిన అంశంపై, వచ్చే శుక్రవారం చర్చ జరగనుంది. సభ్యుడు ఓటింగ్ కోరితే దానిని అమలుచేయక తప్పదు. ఆ సందర్భంలో అధికార తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉండనుందన్న ఉత్కంఠ సహజంగానే కనిపిస్తోంది.
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కెవిపి కొద్దికాలం నుంచి రాజ్యసభలో పోరాడుతున్నారు. తాజాగా తమ పోరాటానికి మద్దతునివ్వాలని కోరుతూ కెవిపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు లేఖలు కూడా రాశారు. శుక్రవారం జరిగే చర్చలో తమకు మద్దతునిచ్చి మీ ప్రతిష్ఠ పెంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా, చర్చలో టిడిపి వైఖరిపై పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపిలు, శాసనసభ్యులు మాత్రం ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతునివ్వడమే మంచిదని వాదిస్తున్నారు. ఆవిధంగా చేస్తేనే తమకు ప్రజల్లో విలువ, రాజకీయ భవితవ్యం ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. లేకపోతే హోదా గురించి అవకాశం వచ్చినా కూడా టిడిపి పారిపోయిందన్న విపక్షాల దుష్ప్రచారం ఎదుర్కోవడం కష్టమంటున్నారు.నిజానికి ఇది బిజెపికి గుణపాఠం చెప్పే సరైన అవకాశమని, బయట హోదా గురించి మాట్లాడుతూ, ప్రైవేటు మెంబరు బిల్లుపై చర్చ జరిగినప్పుడు వాదించకుండా, వౌనంగా ఉంటే ప్రజల ముందు చులకనయిపోతామని వారు చెబుతున్నారు. ఈ విషయంలో తాము స్థానికంగా పడుతున్న ఇబ్బందులను, ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా అధిగమించి, రాజకీయ ప్రయోజనం పొందవచ్చని విశే్లషిస్తున్నారు.
అయితే, పార్టీ సీనియర్లు మాత్రం కెవిపి బిల్లుకు మద్దతునీయడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశమేనంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తున్నందున, ఇరు పార్టీలు కలసిపోయాయన్న అపవాదును ఎదుర్కొంటున్నామని గుర్తు చేస్తున్నారు. బిల్లుకు మద్దతునిస్తే అదే నిజమని నమ్మే ప్రమాదం ఉందంటున్నారు. అసలు రాష్ట్ర విభజనకు మూలమైన కాంగ్రెస్ పార్టీయే ప్రైవేటు మెంబరు బిల్లు పెడితే, తాము దానిని సమర్ధిస్తే రాజకీయంగా నష్టపోతామని స్పష్టం చేస్తున్నారు. పైగా అలాంటి నిర్ణయం తీసుకుంటే, ఇక బిజెపితో యుద్ధం మొదలయిందన్న సంకేతాలకు తెరలేపడమేనంటున్నారు. అయినా ఒకవైపు కేంద్రంలో పార్టీ మంత్రులుండగా, విపక్ష సభ్యుడి ప్రైవేటు బిల్లుకు ఎలా మద్దతిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బాబు, ఈ అంశంలో బుధవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. తమకయితే ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని, రేపు విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక ఎంపి చెప్పారు.