రాష్ట్రీయం

పరీక్ష తప్పుతానేమోనని.. ఉరేసుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, మే 10: పదో తరగతిలో మంచి మార్కులు రావేమో, తప్పుతానేమో అని ఓ విద్యార్థి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. తీరా చూస్తే అతను మంచి మార్కులతో పాసయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని గొడవర్రు హరిజనవాడలో మంగళవారం జరిగింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొడవర్రుకు చెందిన వెలిసెల వినయ్‌కుమార్ (16) కంకిపాడులోని సెయింట్ మేరిస్ స్కూల్‌లో పదవ తరగతి చదివి పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో మంగళవారం 11 గంటలకు ఫలితాలు రావల్సి ఉండగా, తనకు మార్కులు తక్కువ వస్తాయేమోని, తప్పుతానేమోనని భయపడ్డాడు. దీంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సుమారు ఉదయం 10గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం వినయ్ మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వినయ్ పదో తరగతిలో పాసవ్వడమే కాకుండా మంచి మార్కులతో పదికి 9 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.