రాష్ట్రీయం

సివిల్స్‌కు నెల్లూరు విద్యార్థి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 10 : 2105 సివిల్స్ ఫలితాల్లో నెల్లూరు విద్యార్థికి 158వ ర్యాంకు వచ్చింది. నగరంలోని మాగుంట లేఅవుట్‌కు చెందిన పోతరాజు అనిల్‌కుమార్, రమాదేవిల కుమారుడు సాయిచైతన్య ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేస్తూనే సివిల్స్‌లో ర్యాంకు సంపాదించాడు. సాయిచైతన్య చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. సాయిచైతన్య తండ్రి విద్యుత్‌శాఖలోచిన్నపాటి ఉద్యోగం చేస్తూనే సాయిచైతన్యను చదించారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గోమతి స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్మీడియట్‌ను శ్రీచైతన్య కళాశాలలలో పూర్తి చేసి అక్కడి నుంచి ఐ ఐటి జె ఇ 2010లో 3141 ర్యాంకు సాధించాడు. 2104లో బెనారస్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే 2014లో ఎటువంటి శిక్షణ లేకుండా సివిల్స్ రాశారు. 2015లో శిక్షణ తీసుకుని సివిల్స్ రాయగా అందులో 158వ ర్యాంకు సంపాదించారు. ఎట్టకేలకు చిన్ననాటి కోరికను దక్కించుకున్నారు.