ఆంధ్రప్రదేశ్‌

పుణ్యస్నానాలు లేవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం. మన రాష్ట్రంలో ఎవరు ఏ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినా, తిరిగి వచ్చినప్పుడు విధిగా కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దేశ, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు బెజవాడకు వచ్చే భక్తుల్లో 75 శాతం మంది విధిగా కృష్ణా నదిలో పుణ్య స్నానం చేసి, ఆ తరువాతే అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ రెండు నెలల నుంచి భక్తులు ఈ పుణ్య స్నానాలు చేయలేకపోతున్నారు. బెజవాడలో ఆరు ప్రధాన ఘాట్‌లు ఉన్నాయి. ఇందులో దుర్గ గుడి దగ్గర ఉన్న దుర్గా ఘాట్, భవానీ ఘాట్, సీతమ్మవారి పాదాలు ఘాట్, పద్మావతి ఘాట్, పున్నమి ఘాట్, కొండపల్లి ఘాట్ ఉన్నాయి. వీటిలో దుర్గా ఘాట్‌లోనే భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు చేస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మిగిలిన ఘాట్‌ల గురించి తెలియదు. ఘాట్ వద్ద అడుగుపెడితే 20 అడుగుల అగాధంలోకి పడిపోయే ప్రమాదం ఉంది. పుష్కరాలకు ఘాట్‌లను తీర్చిదిద్దేందుకు రెండు నెలల నుంచి ఈ ఆరు ఘాట్‌లను మూసేశారు. ఇందులో దుర్గ ఘాట్ ఒక్కటే దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఉంది. మిగిలిన ఘాట్‌లన్నీ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. దుర్గా ఘాట్‌ను మూసేయడంతో అమ్మవారి దేవస్థానం కనకదుర్గ నగర్‌లో బోర్లు తవ్వి, ఆ నీటిని ట్యాంకులలో స్టోర్ చేసి, షవర్ల ద్వారా భక్తులు స్నానం చేయడానికి నీటిని అందిస్తోంది.