రాష్ట్రీయం

1160 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: బీబీనగర్‌లోని నిమ్స్‌లో 1160 పోస్టులు భర్తీ చేయాలని నిమ్స్ పాలక మండలి నిర్ణయించింది. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో శనివారం నిమ్స్ పాలక మండలి సమావేశం జరిగింది. నిమ్స్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీబీనగర్‌లో నిర్మిస్తున్న నిమ్స్ వైద్యశాలలో అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం 1160 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిమ్స్ పాలక మండలి దీనికి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదానికై సిఎంకు పంపిస్తారు. అదేవిధంగా మానవ వనరుల విభాగానికి అవసరమయ్యే ఉద్యోగుల భర్తీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి సిఎంకు పంపాలని నిర్ణయించారు. ఇక నిమ్స్ టీచింగ్ డాక్టర్ నియామకాలకు ఇప్పుడు అమలులో ఉన్న 4 టైర్ విధానం అమలు చేస్తారు. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే నాలుగు అంచెల విధానం పాటించాలని నిర్ణయించారు. అన్ని స్పెషాలిటీస్‌తో పిజి ఇన్‌స్టిట్యూట్‌ని కూడా త్వరలో మొదలు పెట్టాలని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిమ్స్ పాలక మండలి తీర్మానించింది. బీబీనగర్ నిమ్స్ నుంచి పూర్తిస్థాయి సేవలు త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నిమ్స్ భవన నిర్మాణం తాత్కాలికంగా నిలిచింది. కాంట్రాక్టరును పిలిపించి సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించాలని నిర్ణయించారు. బీబీనగర్ నిమ్స్‌ను 650 పడకల స్పెషాలిటీ హాస్పటల్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఎర్రమంజిల్‌లోని నిమ్స్‌లో నెప్రో- యూరాలజీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ టవర్స్ నిమ్స్‌కు ఒక ఐడెంటిటీ ఐకాన్‌గా నిలిపేట్టు రూపొందిస్తారు. జీవో 14 ప్రకారం నిమ్స్‌లోని ఒప్పంద కార్మికులకు వేతనాలు పెంచాలని నిర్ణయించారు. కార్మికులకు 40 శాతం నుంచి 47 శాతం వేతనాలు పెరుగుతాయి. నిమ్స్ డాక్టర్లకు 25శాతం, ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు ఖరారు అయ్యాయి. 30కోట్లతో వైద్య పరికరాల ఆధునీకరించాలని నిర్ణయంచారు. ఎంఆర్‌ఐ, సిటీస్కాన్ వంటి ఆధునిక పరికరాల కొనుగోలు, ఫర్నిచర్, భవనాల ఆధునీకరణకు అనుమతి ఇచ్చారు. నిమ్స్‌కు పేషెంట్స్‌తో పాటు వచ్చే అటెండెంట్స్ కోసం కొత్త భవనం నిర్మించాలని, దీనికోసం ముందుకొచ్చే దాతల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించింది. నిమ్స్ పాలకమండలి సమావేశానికి వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేష్ తివారి, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నిమ్స్ వైద్య శాల డైరెక్టర్ డాక్టర్ మనోహర్, డీన్ సుభాష్ కౌల్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఖాళీల భర్తీ
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్‌కు కొత్త హంగులు సమకూర్చాలని నిర్ణయించారు. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి శనివారం నిమ్స్‌తో పాటు రిమ్స్ పాలక మండలి సమావేశం నిర్వహించారు. రిమ్స్ సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రిమ్స్‌లోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. రిమ్స్ సంస్థ పరిధిలోనే జాతీయ స్థాయిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అటానమస్‌గా పోస్టులను భర్తీ చేయాలని, ప్రతిపాదనలు సిద్ధం చేసి సిఎం ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. 30 పడకల ఐసియు, ఇతర ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు పాలక మండలి ఆమోదం తెలిపింది.