రాష్ట్రీయం

అవినీతికి అడ్రస్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 14: దేశంలో అవినీతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నేతలు మానవత్వం, అవినీతి అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. శనివారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పాలేరు ఉప ఎన్నికలో మానవత్వం, విలువల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు గతంలో భువనగిరి, చేవెళ్ళ, నారాయణఖేడ్‌లలో ఎందుకు మాట్లాడలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ పాలేరులో మొదటిసారి కాంగ్రెస్‌తో జత కట్టిందని, ఎన్టీఆర్ ఆత్మ దీనితో క్షోభిస్తుందని చెప్పారు. పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు పేరును తమ పార్టీ ప్రతిపాదించినప్పుడే గెలుపు సులభం అని తేలిపోయిందన్నారు. అయితే పార్టీ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజెప్పేందుకే ప్రచారంలో పాల్గొన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నేతలు ప్రచారంలో పాల్గొంటే లేని అభ్యంతరం తమ శాసన సభ్యులు పాల్గొంటే ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తీసుకునే ఏ చర్యనైనా తాము స్వాగతిస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే తట్టుకోలేక ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని గుర్తించాలన్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోగానే భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
దీని ద్వారా నియోజకవర్గంలోని 60 వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తీరతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు టిఆర్‌ఎస్ వెన్నంటే ఉన్నారని, ఎవరెన్ని చెప్పినా తుమ్మలను గెలిస్తారన్నారు.

chitram విలేఖరులతో మాట్లాడుతున్న కెటిఆర్