ఆంధ్రప్రదేశ్‌

మా మొర వినుమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా అంశంపై విపక్షాలతోపాటు మిత్రపక్షమైన బిజెపి సైతం ఇరకాటంలో పెడుతుండటంతో వాస్తవ పరిస్థితిని వివరించి, ఆదుకోవాలని కోరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే కరవు సహాయం అడిగే మిషతో ఆయన మోదీని కలవనుండటం విశేషం.
సిఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున విజయవాడ చేరుకున్నారు.ఉదయం తన నివాసంలో మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, యనమల రామకృష్ణుడుతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రితో బాబు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం ఇప్పటివరకూ రాష్ట్రానికి ఏయే ఖాతాల్లో ఎంతెంత మొత్తాన్ని విడుదల చేసింది? అందులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నేరుగా ఎంత వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటును కేంద్రం ఏమేరకు భర్తీ చేసింది? రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితులేంటి? కేంద్రం ఆదుకోపోతే భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులేంటి? వంటి అనేక అంశాలపై ఒక నోట్ తయారు చేశారు. దీనికి సోమవారం తుదిమెరుగులు దిద్దనున్నారు.
అలాగే సోమవారం రాజకీయ అంశాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బిజెపి నాయకుల వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం లక్షా 70 వేల కోట్లు ఇచ్చినట్టు బిజెపి నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు ఏవిధంగా తెలియచెప్పాలన్న అంశంపై చర్చించబోతున్నారు. కేంద్రంతో మిగిలిన మూడు సంవత్సరాలూ కలిసే పనిచేయాల్సిన అవసరం ఉన్నందువలన టిడిపి వైఖరి ఏవిధంగా ఉండాలన్న అంశంపై చర్చంచనున్నారు.

కరవు పరిస్థితిని వివరిస్తాం
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను ప్రధానికి వివరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 17న ఢిల్లీ వెళుతున్నారని చెప్పారు. అలాగే విభజన చట్టంలోని హోదాతో సహా మిగిలిన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరనున్నట్టు ఆయన తెలియచేశారు. 17న ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఢిల్లీ వెళ్లే బృందంలో ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు.