ఆంధ్రప్రదేశ్‌

యువశక్తితోనే దేశ పురోగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 15: నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్యతో యువతకు సరైన దిశా నిర్దేశం కల్పిస్తే భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం కాకినాడ నగరంలోని ఒక కళాశాలలో ప్రసంగించారు. రానున్న నాలుగేళ్లలో దేశ జనాభాలో అత్యధిక శాతం యువతే ఉండబోతోందన్నారు. ఈ యువశక్తిని సద్వినియో గం చేసుకుంటే దేశ వికాసానికి దోహదపడుతుందని అన్నారు. యువశక్తిని నిర్లక్ష్యంచేస్తే వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. దేశ నిర్మాణానికి విలువలతో కూడిన యువత ఎంతో అవసరమని, నాణ్యమైన విద్య ద్వారా అది సాధ్యమవుతుందన్నారు. ప్రపంచంలో ఉన్న 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన యూనివర్శిటీ ఒక్కటీ చోటుదక్కించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసిన హోయాషి తన రచనలో చైనా సరిహద్దు వద్ద భారతదేశానికి చెందిన ఏ ఒక్క సైనికుడు వెళ్లకుండా దేశాన్ని రక్షించిన ఘనత ఒక్క భారత్‌కే ఉందని చెప్పిన సంగతిని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. సున్నాను కనుగొన్న భారతదేశంలో ఈ విధంగా విశ్వవిద్యాలయాలు వెనుకబడడం తనను తీవ్రంగా బాధిస్తోందని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో యువత సమగ్ర రాణింపునకు దోహదపడే అంశాలను బోధించాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు. మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయినా తెలుగుభాష విడిపోలేదని, యావత్ ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఒకే జాతిగా ఐక్యంగా పురోగమించాలని విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు.