రాష్ట్రీయం

వేదాలు..విజ్ఞాన గనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: వేదాలు విజ్ఞాన గనులని, ఈ విషయాన్ని విదేశీయులు గుర్తించినప్పటికీ, భారతీయులమైన మనం గుర్తించలేకపోతున్నామని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఆదివారం రాజమొహల్లాలోని పండిత నరేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన ‘బాలల వైదిక ప్రశిక్షణ శిబిరం సమాపన సమారోహం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల విశ్వవిద్యాలయాల్లో వేదాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. మన దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో నియత విద్యతో పాటు వేదాలను కూడా జోడించి బోధిస్తే మన విద్యార్థులు ప్రపంచ విఖ్యాత శాస్తవ్రేత్తలు అవుతారనడంలో సందేహం లేదన్నారు. వేదాలను పూర్తిగా వెలుగులోకి తీసుకువచ్చి, సమాజం కోసం వినియోగిస్తే ప్రపంచాన్ని మనం జయించవచ్చన్నారు.
విమాన శాస్త్రం గురించి అధర్వణ వేదంలో ఉందని, దీనికి ఎలాంటి ప్రచారం లేకపోవడంతో రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నట్టు గొప్పగా ప్రచారం జరుగుతోందని ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. అమెరికాలోని మెక్సికో యూనివర్సిటీ చరిత్ర పుస్తకాల్లో వేద సంస్కృతి గురించి రాశారని ఆయన గుర్తు చేశారు. మనువును భారత్‌లో కొంతమంది విమర్శిస్తుంటే, ఫిలిప్పీన్స్ పార్లమెంట్‌లో మనువు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఎంవిఆర్ శాస్ర్తీ తెలిపారు.
భారత దేశంలో వైదిక ధర్మాన్ని పున:ప్రతిష్టించటానికి గొప్ప కృషి చేసిన మహానుభావులలో ఆదిశంకరుల కోవలో ఎన్నదగిన వాడు స్వామి దయానంద సరస్వతి అని ఆయన పేర్కొన్నారు. కేరళలో జన్మించిన ఆదిశంకరులు ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి వేదాలపై పండితులతో వాదించి మెప్పించి వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించారన్నారు. స్వామి దయానంద సరస్వతి కూడా ఆదే మార్గాన్ని అనుసరించి, ఇస్లాం, క్రైస్తవాల వంటి అన్యమతాల దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా, హైందవ ధర్మంలోని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దేశమంతటా పర్యటించి వైదిక ధర్మాన్ని నిలబెట్టారని ఎంవిర్ శాస్ర్తీ వివరించారు.
వేదాలు, యజ్ఞాల గురించి మాత్రమే కాకుండా భారతీయులకు గుండెధైర్యం నేర్పి, ఆర్యసమాజ స్థాపన చేసిన మహానుభావుడు దయానంద అంటూ ఎంవిఆర్ శాస్ర్తీ శ్లాఘించారు. 1880-93 మధ్య కాలంలో గోరక్షణీ ఉద్యమాన్ని గొప్పగా నడిపిన వాడు స్వామి దయానంద అని ఆయన గుర్తుచేశారు. వేదాలు, యజ్ఞాల గురించి భారతీయుల్లో చైతన్యం తీసుకువస్తున్న సంస్థల్లో ఆర్యసమాజం ముఖ్యమైందన్నారు.
ఆర్యసమాజాన్ని 1875లో స్థాపించేందుకు అల్లారఖా రహమతుల్లా సోనామలి అనే ముస్లిం 5000 రూపాయలు ఆనాడే ఇచ్చాడని, నేడు దాని విలువ ఐదుకోట్లకు పైగా ఉంటుందని ఆర్యసమాజ ప్రచారకులు అరవింద్‌శాస్ర్తీ పేర్కొన్నారు. వైదిక సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యానంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజం ప్రతినిధులు లక్ష్మణ్ సింగ్, డాక్టర్ వసుదా, విశే్వశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్యసమాజం గోషామహల్, ఆర్యసమాజ్ ఆర్యనగర్ (ఉత్తర లాలాగూడ) నేతృత్వంలో వేదాలపై 15 రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా ఎంవిఆర్ శాస్ర్తీ తదితరులు సర్ట్ఫికెట్లు అందజేశారు.

‘బాలల వైదిక ప్రశిక్షణ శిబిరం సమాపన సమారోహం’ కార్యక్రమంలో
మాట్లాడుతున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ