ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణులు సత్తా చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపగుంట, మే 17: అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యల సంయుక్తంగా ఈనెల 22న విజయవాడలో నిర్వహిస్తున్న ‘విప్రోత్సవం’ మహాసభకు బ్రాహ్మణులందరూ తరలిరావాలని విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విశాఖనగర పరిధి, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. సమాజంలో బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారని ఈ వివక్షత పనికిరాదన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం ఈ ‘విప్రోత్సవం’లో బ్రాహ్మణులు తమ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి అతిరథ మహారథులు విచ్చేస్తున్న సందర్భంగా బ్రాహ్మణులందరూ తరలిరావాలని కోరారు. అనంతరం ‘విప్రోత్సవం’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

డీసెట్‌కు తొలిరోజు 23 వేల మంది హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 17: ఆంధ్రప్రదేశ్‌లో డిఇడి అడ్మిషన్లకు నిర్వహిస్తున్న డీసెట్ పరీక్షకు మంగళవారం ఉదయం 11,924 మంది, మధ్యాహ్నం 12,134 మంది హాజరయ్యారని డీసెట్ కన్వీనర్ పి.పార్వతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 17వ తేదీ నుండి 19వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి 12.30 వరకూ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకూ రెండు విడతలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని, హాల్‌టిక్కెట్లలో సూచించిన విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్డుగా దీనిని నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. ఈ పరీక్ష కోసం రాష్టవ్య్రాప్తంగా 57 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ‘డీసెట్‌ఎపి.సిజిజి. జిఓవి.ఇన్’ అనే వెబ్‌సైట్‌లో మాక్ టెస్టును ఉంచామని తెలిపారు. అభ్యర్ధులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు.
ఎపి సెక్రటేరియట్ ఫర్నీచర్ వేలం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 17: ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ ఫర్నీచర్ వేలం వేయడానికి రంగం సిద్ధమవుతోంది. సెక్రటేరియట్ ఉద్యోగులు వచ్చే నెల 27వ తేదీలోగా విజయవాడకు తరలి రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ సౌకర్యాలు లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగులు బయల్దేరుతున్నారు. సెక్రటేరియట్‌లో 32 శాఖలు పనిచేస్తున్నాయి. ఇందులో సుమారు 450 సెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష వరకూ ఫైల్స్ ఉన్నాయి. వీటిని హైదరాబాద్ నుంచి విజయవాడకు జాగ్రత్తగా తరలించే బాధ్యతను ఒక కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, గడచిన రెండేళ్ళ నుంచి రాజధాని ప్రాంతంలో వివిధ పనుల నిమిత్తం అనేక కన్సల్టెన్సీలను ప్రభుత్వం నియమించింది. డబ్బు తీసుకుంటున్నా, వారు చేసిన పని మాత్రం ఏమీ లేదు. మరి ఫైళ్ళ తరలింపునకు నియమిస్తున్న కన్సల్టెన్సీ ఏమేరకు పనిచేస్తుందో వేచి చూడాలి. ఒకవేళ కన్సల్టెన్సీని నియమించినా, ఫైళ్ళ తరలింపు బాధ్యతను ఒక్కో శాఖలో ఒక్కో ఉద్యోగికి అప్పగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. కాగా, సెక్రటేరియట్‌లోని ఫర్నీచర్‌ను విజయవాడకు తరలించేందుకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది కాబట్టి, దాన్ని అక్కడికక్కడే వేలం వేసేసి, కొత్త ఫర్నీర్‌ను కొత్త సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.