రాష్ట్రీయం

‘హోదా’ అసాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 19: రాజ్యాంగపరమైన ఇబ్బందుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, అందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సాయం అందచేస్తున్నామని బిజెపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధా ర్థనాథ్ సింగ్ తెలిపారు.
తెలుగుదేశం పార్టీతో సమాచార, అవగాహనా లోపాన్ని అధిగమించేందుకు జాయింట్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. బుధవారం విశాఖకు విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కంటే అధిక నిధులు కేటాయించేందుకు వీలుకల్పించే 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను తెలుగుదేశంసహా అన్ని పార్టీలు ఆమోదించాయని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఫైనాన్స్ కమిషన్ కారణంగా రాష్ట్రాలకు అదనంగా 10 శాతం నిధులు వస్తుండటంతో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను వదులుకునేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఇతరత్రా మార్గాల ద్వారా రాష్ట్రానికి నిధులు, వివిధ ప్రాజెక్టుల మంజూరు వంటివి చేస్తున్నామని వివరించారు. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద రాష్ట్రానికి 98వేల కోట్లు కేటాయించగా, 14వ ఫైనాన్స్ కమిషన్‌లో దాదాపు 2.08 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇది గత ఫైనాన్స్ కమిషన్ కంటే 1.08 లక్షల కోట్లు ఎక్కువన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు 22వేల కోట్ల రూపాయలను గ్రాంట్ కింద నాలుగేళ్ళలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందులో ఇప్పటికే 7000 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. జాయింట్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ విషయమై కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి గురువారం చర్చించనున్నట్టు తెలిపారు. ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల ఇద్దరికీ ఉపయోగం ఉండదని అన్నారు.
సోషల్ మీడియా ద్వారా
మరింత ప్రచారం
సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం చేసేందుకు నిర్ణయించామని సింగ్ తెలిపారు. త్వరలో జరుగనున్న విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల దృష్ట్యా వార్డుల వారీగా పార్టీ పరిస్థితులను పరిశీలించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపి కె.హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బిజెపి నగర అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.