రాష్ట్రీయం

‘మీ సేవ’కు మెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: సాంకేతికతను వినియోగించుకుంటూ రాష్ట్రంలో మరింత సమర్ధవంతగా, వేగవంతంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ దిశగా గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన ఐటి శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పాలనపరంగా తీసుకోవాల్సిన సాంకేతిక మార్పులపై చర్చించారు. మీ సేవ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 329 సేవలకు తోడు అదనంగా మరో వంద సేవలను ఈ నెలాఖరు నాటికి అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ సేవలను దశలవారీగా మీ సేవ కిందకు తీసుకువచ్చి మెరుగైన పాలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ముందుంచాలని కోరారు. అధికారులు ప్రయోగాత్మకంగా రూపొందించిన మీ సేవ యాప్‌ను పరిశీలించిన సిఎం యాప్‌ను మెరుగుపరిచేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు. రేషన్, పెన్షన్ లబ్ధిదారులకు ఇకపై ఎస్‌ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ఎరువుల పంపిణీ నుంచి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వరకు అన్నింటా బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా అవకతవకలకు తావుండదని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి సమీక్షలో అభిప్రాయపడ్డారు. శాటిలైట్ దృశ్యాల ద్వారా పంట నష్టాన్ని తెలుసుకునేందుకు సర్వే నెంబర్ ఆధారంగా పంట వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. సుమారు రాష్ట్రంలోని 15వేల స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు రూ. 50 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, సిఎంవో అదనపు కార్యదర్శి రాజవౌళి, ఐటి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ ఐటి సలహాదారు సత్యనారాయణ పాల్గొన్నారు.

chitram విజయవాడలో గురువారం నిర్వహించిన ఐటి సమీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు