ఆంధ్రప్రదేశ్‌

నేడే ఎంసెట్ మెడిసిన్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 20: మెడిసిన్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఎట్టకేలకు నీట్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాదికి మినహాయింపు లభించడంతో మెడిసిన్, అగ్రికల్చర్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎపి ఎంసెట్-2016 ఫలితాలను ఈనెల 9వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. అయితే నీట్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇంజనీరింగ్ పరీక్షా ఫలితాలను మాత్రమే ఆరోజు విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. తాజాగా మెడిసిన్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షా ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తారని ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. ఫలితాలు వెల్లడి అనంతరం విద్యార్థుల మొబైల్ ఫోన్స్‌కు ర్యాంకులను సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) ద్వారా తెలియజేయనున్నట్టు చెప్పారు. అలాగే ఫలితాలను తీతీతీ.్ఘఔళౄషళఆ.్య ధ్వారా తెలుసుకోవచ్చన్నారు.