తెలంగాణ

ఈడ్చికొట్టిన గాలివాన... ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగరాన్ని మళ్లీ గాలివాన ఈడ్చికొట్టింది. ఆంధ్రను దాటిన రోనూ తుపాను ప్రభావం హైదరాబాద్‌పైనా చూపించింది. కేవలం పది నిమిషాల్లో అల్లకల్లోలం సృష్టించింది. వానదెబ్బకు మహానగరంలో మానులు విరిగిపడ్డాయి. పెద్దపెద్ద హోర్డింగులు పునాదుల నుంచి లేచిపోయాయి. వాటికింద ఇరుక్కున్న కార్లు, ద్విచక్ర వాహనాలు తుక్కుతుక్కు అయిపోయాయి. పెనుగాలికి భవనాల పైనుండే వాటర్ ట్యాంకులు ఎగిరి పక్కిళ్లపై పడ్డాయి. పది నిమిషాల గాలివాన ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. పలువురిని గాయాలపాలు చేసింది. జనజీవనాన్ని స్తంభింపచేసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. మహానగరంపై పగబట్టినట్టు వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో గాఢాంధకారం అలముకుంది. రంగంలోకి దిగిన జిహెచ్‌ఎంసి, ఇతర విభాగాల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.