రాష్ట్రీయం

మంత్రగాడనే నెపంతో వృద్ధుడి సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, మే 21: మంత్రాలు, చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఒక గిరిజన వృద్ధుడిని గ్రామపెద్దలు సజీవదహనం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామమైన ప్రత్తిపాక గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాక గ్రామానికి చెందిన అప్కా లక్ష్మయ్య(68) అనే గిరిజన వృద్ధుడిని ఆ గ్రామపెద్దలు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఊరి నడిబొడ్డులోని ప్రాథమిక పాఠశాల వద్దకు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. మంత్రాలు, చేతబడులు చేస్తున్నావని ఒక చెట్టుకు కట్టి నిలదీశారు. తనకు ఏ పాపం తెలియదని లక్ష్మయ్య ప్రాధేయపడినా వారు వినలేదు. నిజం చెప్పకపోతే మంటల్లో పడేసి కాల్చేస్తామని బెదిరించారు. చిత్రహింసలకు గురిచేశారు. లక్ష్మయ్య తనకేమీ తెలియదని కాళ్లు, చేతులు పట్టుకున్నాడు. ఇదేమీ పట్టించుకోని గ్రామపెద్దలు మరింత రెచ్చిపోయి మాయలు, మంత్రాలు నీతోనే అంతం కావాలని దూషిస్తూ తన్నుకుంటూ సుమారు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కర్రలతో మంట ఏర్పాటు చేసి లక్ష్మయ్యను అందులో పడేసి సజీవ దహనం చేశారు.