రాష్ట్రీయం

కొలిక్కిరానున్న ఆర్డీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తారస్థాయికి చేరుకున్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డిఎస్) వివాదానికి నెలాఖరులోగా తెరపడబోతుంది. ఈ అంశంపై తుంగభద్ర, కృష్ణాబోర్డులు రెండు మూడు రోజుల్లో సమావేశం కాబోతున్నాయి. ఆర్‌డిఎస్ వివాదాన్ని పరిష్కారించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం తుంగభద్ర బోర్డు పరిధిలోకి వస్తుందని కృష్ణాబోర్డు తేల్చిచెప్పింది. దీంతో ఈ అంశాన్ని తేల్చడానికి తుంగభద్ర బోర్డు రెండు మూడు రోజుల్లో సమావేశం కావాలని నిర్ణయించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డిండి, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలియజేడంతో ఈ అంశంపై చర్చించడానికి కృష్ణా బోర్టు కూడా రెండు మూడు రోజుల్లో సమావేశం కాబోతుంది. దీంతో ఈ నెలాఖరులోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన జల వివాదాలను పరిష్కరించడానికి కృష్ణాబోర్టు కీలక సమావేశం కావాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ అయిన ఉత్తర్వులు, యాభై సంవత్సరాల కిందట కర్నాటక ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో పాటు ఆధునీకరణ పనులకు కర్నాటక ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ధీమాతో ఉంది. కృష్ణానదీపై కర్నాటక ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పూర్తి కావడానికి దిగువనున్న తెలంగాణ ప్రభుత్వంతో పేచి రాకూడదన్న వ్యూహంతో రాజోలిబండ వివాదంలో కర్నాటక ప్రభుత్వం తమకు సానుకూలంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాల కథనం. పైగా ఆర్‌డిఎస్‌కు నీటి కేటాయింపులు 50 ఏళ్ల కిందట జరగడం, న్యాయబద్దంగా 15.08 టిఎంసిలు, 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడటం తుంగభద్ర బోర్డు బాధ్యత. ప్రస్తుతం ఆర్‌డిఎస్‌కు కేవలం 5 టిఎంసిల నీరు మాత్రమే అందుతుందని తుంగభద్ర బోర్టు నిపుణుల కమిటీ స్వయంగా తేల్చింది. తుంగభద్ర బోర్టు నిర్ణయం మేరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలోనే ఆర్‌డిఎస్ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు కేటాయించింది. ఈ పనులు కర్నాటక రాష్ట్ర పరిధిలో ఉండటంతో ఆ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లోనే రూ. 58 కోట్లు కేటాయించగా, తీవ్ర జాప్యం తర్వాత 2014 టెండర్లు ఖరారు అయ్యాయి. అయితే అప్పట్లో రాష్ట్ర విభజన డిమాండ్‌తో కర్నాటకపై వత్తిడి లేకపోవడంతో ఆ పనులు ప్రారంభం కాలేదు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ ప్రభుత్వం కర్నాటకతో చర్చించి పనులు ప్రారంభించాలని వత్తడి తీసుకొచ్చింది. దీంతో ఇటీవల పనులు ప్రారంభం కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుంగభద్ర బోర్టు సమావేశమై గతంలో తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేయబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే డిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు గతంలో ఎలాంటి ఒప్పందాలు జరుగలేదని, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మధ్య కుదిరిన గత ఒప్పందాల్లో ఈ రెండు ప్రాజెక్టులు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణాబోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకం కాబోతుంది. ఆర్‌డిఎస్ వివాదం తెలంగాణకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నా, డిండి, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పీటముడితో కృష్ణాబోర్డు నిర్ణయం పట్ల సర్వత్రా ఉత్కంత నెలకుంది.