రాష్ట్రీయం

ఆర్‌ఎల్‌వి రెడీ ... నేడే తొలి స్పేస్ షటిల్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పునర్వినియోగ రాకెట్ (ఆర్‌ఎల్‌వి- టిడి) ప్రయోగానికి శాస్తవ్రేత్తలు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు కూడా షార్ కేంద్రమే వేదికైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు ఆర్‌ఎల్‌వి- టిడి పునర్వినియోగ వాహక నౌక నింగలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ సమయాన్ని 8 నుంచి 6 గంటలకు కుదించి ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రారంభమైంది. ప్రయోగాన్ని పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ ఆదివారం షార్‌కు చేరుకున్నారు. అనంతరం షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ శాస్తవ్రేత్తలతో కలసి మొదటి ప్రయోగ వేదికపై సిద్ధంగావున్న రాకెట్‌ను పరిశీలించారు. రాకెట్ విజయం కోసం విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ డాక్టర్ కె శివన్ ఇస్రో శాస్తవ్రేత్తలతో కలసి సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 1.7 టన్నుల బరువుగల రాకెట్‌ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో (విఎస్‌ఎస్‌సి) మన శాస్తవ్రేత్తలు రూపకల్పన చేశారు. అనంతరం అక్కడ నుండి బెంగుళూరు ఉపగ్రహ తయారీ కేంద్రంలో రాకెట్‌కు పలు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. 2012లోనే ఈ ప్రయోగానికి అనుమతి లభించింది. అనంతరం ఎల్‌ఎంవికేర్ మిషన్ అనే పునర్వినియోగ రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అనంతరం బిజీ షెడ్యూ ల్ కారణంగా ఈ ప్రయోగం ఆలస్యమైంది. ఇలాంటి ప్రయోగాలవల్ల ఒక రాకెట్‌లో ఉపయోగించిన పరికరాలు వృథాకాకుండా మళ్లీ వాటిని తెచ్చుకొని తదుపరి ప్రయోగాల్లో వాడుకోవచ్చు. దీనివల్ల 10 రెట్లు ఖర్చు నియంత్రించడమే కాకుండా, సమయాన్ని ఆదా చేయొచ్చని అంటున్నారు. గతంలో రాకెట్ ప్రయోగం జరిగిన తరువాత వాటి పరికరాలను సముద్రంలో తోసేసేవారు. అలాకాకుండా ఆ పరికరాలను తిరిగి తెచ్చుకొనేలా ఇస్రో వాహక నౌకలను రూపకల్పన చేస్తోంది. ఆర్‌ఎల్‌వి- టిడి రాకెట్‌ను భూమికి 70 కిలోమీటర్ల ఎత్తుకు పంపించి తిరిగి భూమిపైకి తీసుకొస్తారు. రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరినంతరం 70 కిలోమీటర్లు పూర్తిచేసుకోగానే బంగాళాఖాతంలో రాకెట్ పడేలా రూపకల్పన చేశారు. రాకెట్ పడే ప్రాంతంలో సముద్రంలోని షార్‌కు 470 కిలోమీటర్ల దూరంలో ముందుగానే బంగాళాఖాతంలో ఇస్రో ఒక నౌకను సిద్ధం చేసి ఉంచింది. నూతన సాంకేతికతను తెలుసుకొనేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతోంది. అమెరికా ఇప్పటి వరకు 135సార్లు ఇలాంటి స్పేస్ షటిల్‌ను పంపించింది. అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో 2011లో విరమించుకొంది. రష్యా రూపొందించిన సింగిల్ స్పేస్ షటిల్ బురాన్ 1989లో ఒకసారి మాత్రమే ప్రయోగించారు. ప్రస్తుతం మన శాస్తవ్రేత్తలు రీ లాంచ్ వెహికల్ పేరిట రూపకల్పన చేసి విజయవంతంగా ప్రయోగించేందుకు రాకెట్‌లోని ప్రతిభాగాల పనితీరును క్షుణ్ణంగా పరీక్షించారు. దీని రూపకల్పనకు రూ.95కోట్ల వ్యయం ఖర్చు చేశారు. ఇందులో 750 మంది ఇంజినీర్లు పాలుపంచుకొన్నారు. వీరిలో 150మంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి)లో పనిచేసే వారు ఉన్నారు. మిగిలిన 600మంది ఇస్రోలోని వివిధ విభాగాల్లో పనిచేసేవారు పాల్గొన్నారు. వీరేకాకుండా నేషనల్ ఏరోనాటికల్ ల్యాబ్ (ఎన్‌ఎఎల్), ఐఐటి, ఐఐఎస్‌సి శాస్తవ్రేత్తలు పరోక్షంగా పాలుపంచుకొన్నారు.

చిత్రం... షార్ ప్రయోగించే ఆర్‌ఎల్‌వి- టిడి రాకెట్