రాష్ట్రీయం

లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన యువకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఆదివారం ఓ సందర్శకుడు లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అప్రమత్తమైన జూ అధికారులు అతడిని ఎన్‌క్లోజర్‌లో నుంచి బయటకు తీసుకువచ్చారు. రాజస్థాన్ సికర్ జిల్లా కుర్దియా గ్రామానికి చెందిన ముఖేష్ (35) సాయంత్రం 4.55 నిముషాలకు అఫ్రికన్ లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. ఆ సమయంలో యానిమల్ కీపర్ పాపయ్య అక్కడే ఉండడంతో పెద్దప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పాపయ్య ఎన్‌క్లోజర్ నుంచి ముఖేష్‌ను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే ముఖేష్‌కు గాయాలయ్యాయి. ముఖేశ్ మెట్రో రైల్వేలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ముఖేష్‌ను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.