ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీ ప్రాంతాల్లో సోలార్ పంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారికి సురక్షితమైన మంచినీరు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 66 సోలార్ ఆధారిత డ్యూయల్ పంప్‌పైప్ వాటర్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఈ వ్యవస్థ అమలు కోసం జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద 324 లక్షల రూపాయలను విడుదల చేశామన్నారు. సాధారణ చేతి పంపులు 120 అడుగుల మేరకు మాత్రమే నీటిని బయటకు విడుదల చేస్తాయన్నారు. ఈ సోలార్ డ్యూయల్ పంపు లోతు ఎక్కువగా ఉన్నా నీటిని బయటకు తీసుకువస్తాయన్నారు. ఇవి తక్కువ జనాభా ఉన్న ఆవాసాల్లో ఉపయోగపడుతాయన్నారు. కరెంటు ఇబ్బందులు తలెత్తినప్పటికీ సోలార్ పంపు పనిచేస్తుందని ఆయన చెప్పారు.