రాష్ట్రీయం

ఠారెత్తిస్తున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రం మీదుగా పొడి, వేడి గాలులు వీస్తుండటంతో చాలా చోట్ల సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోను తుపాను కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికి, తుపాను తరువాత ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ సోమవారం మరింత ఎక్కువగా నమోదు అయ్యాయి. సోమవారం తునిలో 45 డిగ్రీలు, బాపట్లలో 44, కాకినాడలో 43.4, ఒంగోలు, విజయవాడ, విశాఖ విమానాశ్రయం, గన్నవరం, మచిలీపట్నంలో 43 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఉదయం నుంచి ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో పాటు మధ్యాహ్నానానికి కొన్ని చోట్ల వడగాల్పులు వీచాయి. విశాఖలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో ఉదయం నుంచి రహదారులు నిర్మానుష్యంగా మారాయి. విశాఖలో పాలిసెట్‌కు సంబంధించి సర్ట్ఫికెట్ల పరిశీలిన సోమవారం నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు, తల్లితండ్రులు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖలో సాధారణం కంటే 7 డిగ్రీలు, బాపట్లలో 5, కాకినాడలో 4 డిగ్రీలు అధికంగా నమోదు అయినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. వాయువ్య దిశగా వస్తున్న పొడి, వేడి గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి రానున్న రెండు రోజులు కొనసాగుతుందని హెచ్చరించారు.