ఆంధ్రప్రదేశ్‌

సచివాలయానికి దారేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 24: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి రహదారి ఏర్పాటుకాలేదు. చిత్తడి నేల కావడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సచివాలయం వరకు వెళ్లాలంటే అవస్థలు తప్పటంలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే ఈ అనుభవం ఎదురైంది. మంగళవారం వెలగపూడిలో సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించేందుకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఎమ్మెల్యేలు, సీఆర్డీయే అధికారులతో కలసి ముఖ్యమంత్రి ప్రత్యేక బస్సులో వెలగపూడికి బయల్దేరారు. తాత్కాలిక సచివాలయ ఆవరణలోనే మోకాలిలోతు గోతిలో బస్సు బురదలో దిగబడింది. దీంతో ముఖ్యమంత్రి సచివాలయ భవనాల వద్దకు కాలినడకన చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడకు తరలివెళ్లారు. తుపాను ప్రభావం వల్ల ఒక మోస్తరు వర్షాలు కురిస్తేనే పరిస్థితి ఈ రకంగా ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందో అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
చిత్రం.... సచివాలయ ఆవరణలో బురదలో కూరుకుపోయిన ప్రత్యేక బస్సు