తెలంగాణ

2019లోనూ టిఆర్‌ఎస్‌కే మా ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మే 24: తమ గ్రామాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల గ్రామ కమిటీ తీర్మానించింది. మంగళవారం గ్రామంలో సమావేశమైన గ్రామస్థులంతా విడిసి ఆధ్వర్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తీర్మానం కాపీని స్థానిక ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డికి అందించేందుకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాయకులంతా హైదరాబాద్ తరలివెళ్లి ఎమ్మెల్యేకు అందజేశారు. గ్రామ శివార్ల గుండా గోదావరి నది ప్రవహిస్తున్నా, గత పాలకులు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని కోరితే పట్టించుకోలేదని గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎత్తిపోతల పథకాన్ని చేపడితే గ్రామంలోని 2,452 ఎకరాల పంట భూములకు సాగునీరు అందుతుందని, దాంతో పాటుగా గ్రామంలోని చింతామని చెరువు, కొత్తచెరువు, ఐనర్లకుంట నిండుతుందని వారు తెలిపారు. దీని కోసం జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అటు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఒప్పించి ఎత్తిపోతల పథకానికి 11.40 కోట్ల రూపాయలు మంజూరీ చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి పూర్తిస్థాయిలో చేయూతను అందించినందున 2019లో జరిగే ఎన్నికల్లో తమ గ్రామం టిఆర్‌ఎస్‌కే పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేను సన్మానించి, తీర్మానం కాపీని అందజేశారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మద్దతు పలికినందుకు అభినందించిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, అతి తక్కువ సమయంలోనే గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని, భవిష్యత్‌లో సాగునీటి ఇక్కట్లు ఏర్పడకుండా చూస్తానని గుమ్మిర్యాల గ్రామ కమిటీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌కు తరలి వెళ్లిన వారిలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఇదిలా ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో మద్దతు పలికిన రాష్ట్రంలోనే తొలి గ్రామంగా వేల్పూర్ మండలంలోని మోతె రికార్డులకు ఎక్కగా, ప్రస్తుతం గుమ్మిర్యాల గ్రామం 2019 ఎన్నికలకు టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపి తెలంగాణలోనే మొదటి గ్రామంగా గుర్తింపు పొందనుంది.