ఆంధ్రప్రదేశ్‌

ఈ-ఆఫీస్‌లోనే ఫైళ్ల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: రాష్ట్రంలో జూన్ 30 నుంచి ఈ-ఆఫీస్‌లోనే ఫైళ్ళ నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రెండురోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు విజయవాడలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ-ఆఫీస్ విధానంపై చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేయడానికి చిత్తూరు, విజయనగరం జిల్లాలకు జూలై 15 వరకూ గడువు ఇవ్వనున్నట్టు చెప్పారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఈ-ఆఫీస్ విధానంలోనే కార్యకలాపాలు సాగించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఇమెయిల్ (జిఓవిటి.ఇన్)ను తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఈ-ఆఫీస్ అమలు తీరును తోటి కలెక్టర్లకు వివరించారు. జిల్లాలోని 89 కార్యాలయాల పరిధిలో 9097 ఆర్గనైజింగ్ యూనిట్లు క్రియేట్ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 7,548 మంది అధికారులు, సిబ్బందికి గవర్నమెంట్ మెయిల్ ఐడిలు తీసుకోవడంతోపాటు 297 మందికి డిజిటల్ కీలను పొందామని తెలిపారు. కృష్ణా జిల్లాలో వివిధ శాఖల పరిధిలోని రెండు లక్షల 2,23,582 ఫైళ్లను వాటిలో ఒక కోటి 72 లక్షల 40 వేల 119 పేజీలను ఈనెల 23 వరకూ స్కాన్ చేశామని కలెక్టర్ బాబు వివరించారు. ఇప్పటివరకూ రెండు లక్షల రెండు వేల 193 ఫైళ్ళను అప్‌లోడ్ చేశామని బాబు చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని, మిగిలిన కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. డిజిటల్ కీకి బదులు ఆధార్ అధంటిఫికేషన్‌పై దృష్టి పెట్టాలని సిఎం సూచించారు.
జన సమాచార నిధి సర్వేపై చర్చ
ఇదిలా ఉండగా జన సమాచార నిధి సర్వేపై కలెక్టర్ల సమావేశంలో ఐటి సలహాదారు జె సత్యనారాయణ వివరాలు తెలియచేశారు. ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి జన సమాచారంతోపాటు, వారి ఇళ్ళను జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. రెండు నెలల్లో ఈ సర్వే పూర్తి చేస్తామని ఆయన తెలియచేశారు. జూన్ 15 నుంచి సర్వే ప్రారంభించి, జూలై నెలలో పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. స్టార్ట్ పల్స్ సర్వే 2016 యాప్‌ను స్మార్ట్ ఫోన్, ట్యాబ్‌ల ద్వారా ఎలా నిర్వహించవచ్చన్న సాంకేతిక వివరాలను కలెక్టర్లకు ఐటి సలహాదారు సత్యనారాయణ తెలియచేశారు.