ఆంధ్రప్రదేశ్‌

సిఎంగారూ భుజాలు తడుముకోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 25: కాపు జాతి మేలు కోసం తాను లేఖలు రాస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఇటీవల తాను రాసిన లేఖలపై ముఖ్యమంత్రి కోటరీ ద్వారా చేయిస్తున్న విమర్శలకు ముద్రగడ మరోసారి ప్రతివిమర్శలు చేశారు. ఆయన తాజాగా రాసిన లేఖ ప్రతులను తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కాపు సద్భావన సంఘ నేతలు బుధవారం విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలపై భుజాలు తడుముకుంటున్నారని ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. కాపు భవనాలకు చంద్రన్న పేరుతో పాటు చంద్రన్న మరుగుదొడ్డి, చంద్రన్న జైలు పథకం అని పెట్టుకుంటారా? అని ముద్రగడ ప్రశ్నించారు. చంద్రన్న పేర్లు సహాయం పొందిన వారు పెట్టుకోవాలి తప్ప, జిఒల ద్వారా శాసించడం తప్పుకాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో గత పదేళ్లుగా ఏంచేశారంటూ తనను ప్రశ్నిస్తుంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కాపుల సంక్షేమం కోసం తాను చేసిన పోరాటం అందరికీ తెలుసునని ముద్రగడ పేర్కొన్నారు. జాతి కోసం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి రైల్‌రోకోలు, రాస్తారోకోలు చేశానని, అనేక రూపాల్లో ఆందోళనలు చేసి తుదకు 1994లో జిఒ నెంబర్ 30ను సాధించానన్నారు. అయితే ఆ జిఒ చెల్లదని ఒకసారి, చెల్లుతుందని మరోసారి చెప్పిన ఘనత మీదేనని చంద్రబాబును ముద్రగడ దుయ్యబట్టారు. మా దురదృష్టం కొద్దీ ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఒక నేతతో జిఒ నెంబరు 30కి వ్యతిరేకంగా హైకోర్టులో అడ్డుతగిలి అమలుకాకుండా చేశారని ఆరోపించారు. తర్వాత 1995లో కాపులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ పదేళ్లు అధికారంలో ఉన్న మీరే ఆ తీర్పు అమలుకాకుండా చేయలేదా అని ప్రశ్నించారు. జగన్ చేతుల్లో వ్యక్తిగా, ఆయన ఆడినట్టు తాను ఆడుతున్నట్టు చేయిస్తున్న ప్రచారాన్ని రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. ఎవరో చెప్పింది చేయడానికి తాను రాజకీయ ఓనమాలు తెలియనివాడిని కాదన్నారు. ఇటువంటి దుష్ట ఆలోచనలు మానుకోవాలని లేఖలో పేర్కొన్నారు.