ఆంధ్రప్రదేశ్‌

చేతివృత్తులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: రానున్న కాలంలో చేనేత, హస్తకళ వృత్తుల ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ శాఖపై జరిగిన చర్చిలో చంద్రబాబు మాట్లాడుతూ చేనేత రంగంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు దిశా, నిర్దేశం చేశారు. చేనేత చీరలు లక్ష, లక్షన్న రూపాయలు పలుకుతున్నాయని, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చీరలకు విదేశాల్లో గిరాకీ ఉందని సిఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో ఖరీదైన చీరలు నేసే చేనేత కళాకారులకు విదేశీ మార్కెట్‌లో సంబంధాలు నెలకొల్పేలా ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహించాలని అన్నారు. వీరికి మార్కెటింగ్ నైపుణ్యాలు నేర్పితే అద్భుతంగా ఎదుగుతారని అన్నారు. పవర్‌లూమ్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులందరికీ ఉపాధి కల్పించవచ్చని, పవర్‌లూమ్స్‌కు భారీగా సబ్సిడీ ఇస్తామని అన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులను కాపాడాలని క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, వారి పరిరక్షణకు ఏమేం చేయాలో నిర్ణయిస్తామని అన్నారు. లేపాక్షి సంస్థ 34 కోట్ల టర్నోవర్‌తో రెండు కోట్ల లాభాలు ఆర్జిస్తుంటే, అదే తరహాలో చేతి వృత్తులు, మిగిలిన జిల్లాలో హస్త కళా వస్తువుల తయారీని ప్రోత్సహించి కాపాడాలని అన్నారు. హ్యాండిక్రాఫ్ట్ వస్తువుల విక్రయానికి, లేపాక్షి తరహాలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళతామని అన్నారు.
పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియాలి డిప్యూటీ సిఎం కెఇ
రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. వాటి గురించి ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగంపై ఉందని డెప్యూటి సిఎం, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. కలెక్టర్ల సదస్సులో కెఇ ప్రసంగిస్తూ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను తహశీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విఆర్‌ఓలను, తహశీల్దార్లను వారివారి సొంత మండలాలు, డివిజన్లకు దూరంగా నియమిస్తున్నామని అన్నారు. మండల స్థాయిలో డిజిటల్ కీ దుర్వినియోగమవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని మంత్రి కృష్ణమూర్తి తెలియచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విషయాన్ని జెసిల దృష్టికి తీసుకువచ్చమని ఆయన అన్నారు. ఇందులో అవినీతికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆయన చెప్పారు. మీ సేవాలో ఎక్కువ రుసుము వసూలు చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ అవినీతిలో విఆర్‌ఓలకు బాగస్వామ్యం ఉందని తెలిసిందని అన్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. తప్పు చేస్తే, మీ సేవా కేంద్రాల పర్మిషన్ రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు, మ్యుటేషన్స్‌ను 30 రోజుల్లో జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటి గురించి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
29 రోజుల వరకూ సంబంధిత దరఖాస్తులపై చర్యలు తీసుకోకుండా, ఆఖరి రోజున దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆయన చెప్పారు.