రాష్ట్రీయం

వరద నష్టం 3759 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు మరింత తీవ్రంగా దెబ్బతీశాయని, వివిధ రంగాలకు 3759.97 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఇతోధికంగా సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు సిఎంఓలో ఆయన కేంద్ర వరద నష్టం అంచనా బృందంతో సమావేశం అయ్యారు. గత నెల 15 నుండి 23వ తేదీ వరకూ భారీ వర్షాలు, వరదలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయని, జనజీవనం స్తంభించిపోయిందని చెప్పారు. వర్షాలు, వరదల నష్టాల్లో వ్యవసాయ శాఖకు 426.94 కోట్లు, ఉద్యానవన శాఖకు 335.27 కోట్లు,పశుసంవర్ధక శాఖకు 17.97 కోట్లు, మత్స్యశాఖకు 492.96 కోట్లు, చేనేత వస్త్ర పరిశ్రమలకు 4.77 కోట్లు నష్టం వాటిల్లిందని సిఎం అన్నారు. జలవనరుల శాఖకు 818.29 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 711.9 కోట్లు , విద్యుత్ శాఖకు 35.05 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 589.54 కోట్లు, పురపాలక శాఖకు 124 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు 124.34 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. భారీ వర్షాల దెబ్బకు 6507 పక్కా ఇళ్లు, 17080 పూరి గుడిసెలు ధ్వంసం అయ్యాయని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి మొత్తం 3759.97 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి నష్టాలు, భారీ వరదలపై 5వ తేదీన నివేదిక అందించామని , కేంద్రప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని సిఎం పేర్కొన్నారు. వరద బాధితులుగా మారిన 1.25 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించామని ఉచితంగా మంచినీరు, ఆహారం అందించామని అన్నారు.నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షపాతం కిందటి ఏడాది కంటే 6 నుండి 11 రెట్లు అధికంగా కురిసిందని అన్నారు. సమావేశంలో ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు, సిఎంఓ ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, వ్యవసాయ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, కేంద్రం బృందం సభ్యులు పాల్గొన్నారు.
chitram...
శుక్రవారం సిఎంఓలో కేంద్ర వరద నష్టం అంచనా బృందంతో సమావేశమైన ఏపి సిఎం చంద్రబాబు