రాష్ట్రీయం

భూసేకరణను అడ్డుకుంటాం: సిపిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 11: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో రైతుల అంగీకారం లేకుండా ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటోందని, ఇలాంటి విధానాన్ని తమ పార్టీ అడ్డుకుంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రైతుల ఆమోదం లేకుండా భూసేకరణ జరపకూడదని 2013 భూసేకరణ చట్టం స్పష్టంగా పేర్కొంటుంటే, రాష్ట్రప్రభుత్వం మాత్రం రైతుల నుండి భూములను లాక్కుంటోందన్నారు. విమానాశ్రయం నిర్మాణం కోసం భోగాపురంలో భూములను లాక్కుంటూ, అడ్డొచ్చిన రైతులను అరెస్ట్ చేస్తోందన్నారు. రైతుల ఆమోదం లేకుండా, వారికి పరిహారం చెల్లించకుండా ఇలా మెడపై కత్తిపెట్టి భూములను లాక్కోవటం దుర్మార్గమన్నారు. ఇలాంటి బలంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గోపాలరావు అధ్యక్షతన రైతు సంఘాలు, రైతులు, రైతు కూలీలు, వివిధ సంస్థలు, సంఘాలతో కలిసి ఒక వేదిక ఏర్పడిందన్నారు. ఈ వేదిక చేసే ఉద్యమాలకు సిపిఎం మద్దతు పలుకుతోందన్నారు. తుళ్లూరులో బలవంతపు భూసేకరణను అడ్డుకున్న రైతుకు చెందిన 7.5 ఎకరాల్లోని అరటి తోటను రాష్ట్ర ప్రభుత్వం దున్నించిందన్నారు. గోపాలరావు అధ్యక్షతన ఏర్పడి రైతుల హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, మార్చిలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. పోలవరం నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించకుండా బలవంతంగా ఖాళీచేయిస్తున్నారని, భూమికి భూమి ఇవ్వాలన్న నిబంధనను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఎక్కడో వ్యవసాయ భూమి, మరెక్కడో ఇంటి స్థలాన్ని ఇవ్వటం సరికాదన్నారు. గిరిజనులు గ్రామాలను ఖాళీ చేయకపోతే సంక్షేమ పథకాలను కత్తిరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారన్నారు.
నేడు, రేపు సిపిఎం రాష్ట్ర సమావేశాలు
రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసుకోవాలన్న లక్ష్యంలో భాగంగా శని, ఆదివారాల్లో రాజమండ్రిలో సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశాలు ఏర్పాటుచేసినట్టు రాష్ట్ర కార్యదర్శి మధు చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సమావేశం, సాయంత్రం బహిరంగ సభ జరుగుతాయన్నారు. రాజమండ్రి సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు.