ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాల ప్రగతి టిడిపి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27:ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ ఆశయాల సాధనకు తాను కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్‌టిఆర్ ఆశాయాలను ముందుకు తీసుకువెళ్ళే దిశగానే అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిరుపేదల కోసం ఎన్‌టిఆర్ రూ.2కే కిలో బియ్యం అందిస్తే, అదే స్ఫూర్తితో నేడు టిడిపి ప్రభుత్వం ఒక్క రూపాయికే కిలో బియ్యం అందిస్తోందన్నారు. కుటుంబంలో ఒకరికి 4 నుంచి 5కేజీల బియ్యం అందిస్తున్నామని తెలిపారు.ఎన్‌టిఆర్ పేదలకు కూడు,గూడు,గుడ్డ అనే లక్ష్యంతో పాలన అందించారని, అందుకే ఆయన పేదల గుండెళ్ళో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. రైతులకు స్లాబ్‌రేట్‌కే విద్యుత్‌ను, నిరుపేదలకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చారని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో దళితుల ఆశాజ్యోతైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. జూన్ 2వ తేదీ నాటికి ఏపిలో టిడిపి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తవుతుందని ఈ పరిస్థితుల్లో మహనాడులో మనం ప్రజలకు ఏం చేశామన్నదానిపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వితంతువులు, వికాలంగులు,వృద్ధులకు రూ.1000 నుంచి రూ.1200 వరకు పెన్షన్లు ఇచ్చామని, ఎన్‌టిఆర్ వైద్యసేవ కార్యక్రమంలో రెండు లక్షల 50వేలు ఆర్థిసాయం అందించడమే కాకుండా, వంద రకాల రోగాలను ఈ పథకం కిందకు తీసుకువచ్చామని అన్నారు. విద్య, వైద్యంపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతోందని అన్నారు. రెయిన్‌గన్స్ ద్వారా రోజుకు లక్ష ఎకరాల తడి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పేద మహిళలందరికి వంటగ్యాస్‌ను అందిస్తామని, పేదలకు, అసంఘటిత రంగ కార్మికులకు, వ్యయసాయ కూలీలకు, తోపుడు బండ్లు వ్యాపారులకు, ముఠాకార్మికులకు రూ.5లక్షల బీమా పథకాన్ని కూడా అమలు చేసిన ఘనత టిడిపిదే అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకుండా ఎందరు అడ్డుపడ్డా ల్యాండ్‌పూలింగ్ ద్వారా 34వేల ఎకరాల అందించారన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం నేడు చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు.
ఒకప్పుడు విద్యుత్ కోతలుండే పరిస్థితి నుంచి నేడు కోతలు లేని పరిస్థితికి చేర్చామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ స్కూల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటునామని, స్కిల్ డెవెలప్‌మెంట్‌కు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మైనార్టీల కోసం రూ.770 కోట్లు, కాపులకు రూ.1000 కోట్లు కేటాయించామని, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. అవినీతిరహిత సమాజ స్థాపనకు చర్యలు తీసుకోవడంలో బాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు సి ఎం వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం, స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయడానికి సైతం వెనుకాడ కుండా చర్యలు చేపట్టామని అన్నారు.
సామాజిక న్యాయం కోసం కృషి
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో సామాజిక న్యాయం తెచ్చేందుకు టిడిపి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. కరవుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలన్నారు. హైదరాబాదును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టిడిపియేనని ఇకపై కూడా ఇక్కడ ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఏపిలో అధికారంలో ఉంటే తెలంగాణలోప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలను గమనిస్తే టిడిపి కూడా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంటేనే అధికారం దక్కుతుందని గుర్తించాలని అన్నారు. అధికారం స్వార్థం కోసంకాదని, ప్రజాహితం కోసమేనని, అయితే అది మంచివారి చేతులో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని గుర్తించాలన్నారు.