ఆంధ్రప్రదేశ్‌

కార్యకర్తలకు పాదాభివందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: తెలుగు దేశం పార్టీకోసం ప్రాణాలను అర్పించి, సర్వస్వం త్యాగం చేసి పార్టీ పటిష్ఠతకోసం పనిచేసిన, చేస్తున్న కార్యకర్తల పాదాలకు ఈ మహానాడు వేదికగా వందనం చేస్తున్నానని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు ఉద్వేగంగా అన్నారు. శుక్రవారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో మూడు రోజుల మహానాడు ప్రారంభ సభలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తలను, నాయకులను ఉత్సాహపరిచేలా, వారిలో చైతన్యం తీసుకువచ్చేలా ప్రసంగించారు. తెలుగుజాతి కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడింది తెలుగుదేశం పార్టీ అన్నారు. నిరుపేదజనం, రైతులు, మహిళలు, యువకులు, అన్నార్తుల కోసం ఆవిర్భవించిన పార్టీ టిడిపి అన్నారు. అనేక జెండాలు, పార్టీలు పుట్టుకువచ్చినా 35 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు ఇతర పార్టీలను, జెండాలను పక్కన పెట్టారని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టిడిపికి గుర్తింపు వచ్చిందంటే అది కార్యకర్తల త్యాగ ఫలమేనని అన్నారు. పార్టీని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడంలోను, బతికించుకోవడంలోను తమ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం అంటూ పిలుపునిచ్చారు.
టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, ప్రజల కోసం సినీ జీవితాన్ని వదులుకుని చివరివరకు క్రమశిక్షణతో నిలబడ్డ నాయకుడని అన్నారు. ఆయన ఆశయ స్పూర్తితో పనిచేస్తున్న తాను టిడిపి అనే కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నానే తప్ప పెత్తనం కోసం కాదని చెప్పారు. క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తే మనల్ని ఎవరూ ఏమీచేయలేరని చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపికి అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్ళని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ప్రజలకు సమగ్రమైన, సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యత టిడిపిపై ఉందన్నారు. ఎదుటి వ్యక్తి మన ద్వారా అవినీతి చేయించాలనుకున్నా, అక్రమాలకు పాల్పడాలని భావించినా వ్యతిరేకించాల్సిందే అన్నారు. గ్రామాలకు వెళ్ళినా అక్కడ కూడా 80శాతం మంది మన వెంటే ఉండాలన్నారు. ఇందుకోసం టిడిపి కార్యకర్తలు సమర్థత పెంచుకోవాలని సిఎం స్పష్టం చేశారు.
టిడిపికి ఏ పార్టీకి లేని విధంగా 54 లక్షల మంది కార్యకర్తలున్నారని, వీరంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజా సేవకు, పార్టీకోసం పనిచేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారని, వారి గుర్తింపు లభించినప్పుడే పార్టీ బలపడుతుందన్న విషయం మరచిపోరాదని సిఎం అన్నారు. ప్రజలంటే టిడిపి, టిడిపి అంటే ప్రజలు అనేలా పనిచేయడానికి ఈ మహానాడు స్ఫూర్తి కావాలన్నారు. పార్టీ కోసం, ప్రజాసేవ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు ఉంటుందన్న విషయం మరచిపోరాదన్నారు. టిడిపి ప్రభుత్వం అన్ని నామినేటడ్ పదవుల్లో పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వివరించారు.

తిరుపతిలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ తదితరులు