ఆంధ్రప్రదేశ్‌

తెలుగు సంస్కృతికి వెలుగు బుద్ధ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మంచి మనిషి, తెలుగు సంస్కృతిని వికసింపజేశారని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య ప్రశంసించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో మండలి బుద్ధ ప్రసాద్ షష్ట్యబ్దిపూర్తి ఉత్సవానికి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బుద్ధ యా నం’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ బుద్ధ ప్రసాద్ అంటే బుద్ధుని వంటివారేనని అన్నారు. 1977 సంవత్సరంలో దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు బుద్ధ ప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేసి ఉప్పెన బాధితులను ఆదుకోవడంలో నిమగ్నమయ్యారని చెప్పారు. మంత్రిగా ఉంటూ బాధితులను ఆదుకోవడం అంటే రెండు పనులూ చేయడం సాధ్యం కాదన్న భావనతో అలా చేశారని ఆయన వివరించారు. బుద్ధ ప్రసాద్ కూడా తండ్రికి తగిన తనయుడని ఆయన తెలిపారు. తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు తెలుగు సంస్కృతిని వికసిపంజేశారని ఆయన చెప్పారు. ఎక్కడ తెలుగు మాట విన్నా బుద్ధ ప్రసాద్ జ్ఞాపకం వస్తారని అన్నారు. తండ్రీతనయులు ఇద్దరూ తెలుగు భాష పట్ల అభిమానం కలిగిన వారని ఆయన తెలిపారు.
ఆదర్శప్రాయుడు: చక్రపాణి
ఎపి శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ రాజకీయాల్లో, తెలుగు సాహితీ రంగంలో మండలి బుద్ధ ప్రసాద్ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ప్రధానమైన చట్ట సభకు ఉప సభాపతిగా ఉంటూ సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు.
కలిసి పని చేద్దాం: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కవిత ప్రసంగిస్తూ తెలుగు రాష్ట్రాల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా అభివృద్ధికి కలిసి పనిచేద్దామని అన్నారు. పెళ్ళయిన నెల రోజులకే కొంత మంది విడాకులకు వెళుతున్న ఈ రోజుల్లో షష్టిపూర్తి చేసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
నాన్నకు ఇష్టం లేదు: బుద్ధ ప్రసాద్
మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ తాను రాజకీయాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం ఉండేది కాదని అన్నారు. రాజకీయాల్లోకి రాకుండా సమాజ సేవకు అంకితం కావాలని, సంఘ సంస్కర్తగా నిలవాలని ఆకాంక్షించారని ఆయన తెలిపారు. తాను ఏనాడూ గొప్పతనం కోసం ప్రయత్నించలేదని చెప్పారు. తనకు మంచి ఆలోచన ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అనడంతో సభికులు కరతాళధ్వనులు చేశారు. తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు లేకుండా కలిసి పని చేద్దామని టిఆర్‌ఎస్ ఎంపి కవిత చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. ఇంకా ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సినీ నటి జమున, సాహితీవేత్త పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ యల్లా వెంకటేశ్వర రావు, ఎపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్, కినె్నర ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ప్రభాకర్ రావు (రిటైర్డ్ డిజిపి), కొండలరావు, వోలేటి పార్వతీశం, కినె్నర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.