ఆంధ్రప్రదేశ్‌

ప్రజా విశ్వాసమే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించుకుందని టిడిపి జాతీయ అధ్యక్షులు,సిఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు టిడిపి నిస్వార్థంగా సేవ చేయాల్సిన అవసరాన్ని, ప్రజా విశ్వాసాన్ని పొందాల్సిన బాధ్యతను కార్యకర్తలకు బోధించారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు భవిష్యత్తులో కూడా టిడిపి అధికారాన్ని ప్రజాహితం కోసమే వినియోగిస్తుందని తెలిపారు. రాయలసీమను హర్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానని, కృష్ణాడెల్టా ద్వారా నీటిని రాయలసీమకు పంపించి దాన్ని రతనాల సీమగా మారుస్తామన్నారు. విభజన తరువాత డబ్లుల్లేవని పేదలను వదిలేయకుండా వారికోసం శ్రమిస్తున్నామన్నారు. చివరికి రాజధానిని సైతం అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నా, తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నా ఈ రెండురాష్ట్రాల్లోని నిరుపేద, బడుగు,బలహీన వర్గాలు,బిసిలు, మహిళలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేశారని దీంతో అనేక ఇబ్బందుల్లో ఉన్న ఏపికి తాను ముఖ్యమంత్రి అయితేతప్ప న్యాయం జరగదని ప్రజలు భావించారని, అందుకే అధికార పగ్గాలు టిడిపికి అప్పగించారని చెప్పారు. విభజన తరువాత అనేక సంక్షోభాలు, సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నామని, రాష్ట్భ్రావృద్ధిలో కేంద్ర సహకారం కోసమే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కొన్నామన్నారు. విభజన తరువాత ఏపికి 47శాతం ఆదాయం వస్తుందని, తెలంగాణకు 53శాతం ఆదాయం వస్తుందని అంచనావేశారని తెలిపారు. దక్షిణ భారత దేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయం తక్కువని, ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం సహకారం కోసం 18 నుంచి 19సార్లు తిరిగానని, ఇకపై కూడా తాను కృషిచేస్తానని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. టిడిపి రెండు సంవత్సరాల పాలనా ఫలితాలు నేడు అందుతున్నాయని చెప్పారు.

తిరుపతిలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సత్కరిస్తున్న తెలంగాణ నేతలు