రాష్ట్రీయం

కాపుల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 11: బిసి జాబితాలో చేర్చాలనే కాపుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రకటించారు. కేవలం మద్దతివ్వడమేకాక, ఇదే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమిస్తుందన్నారు. దీనికోసం జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీలోని బలిజ, తెలగ, ఒంటరి, కాపు ప్రతినిధుల రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని సామాజికవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాపులను బిసిల్లో చేర్చాలన్న ఉద్యమంలో పాల్గొంటారన్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కాపులను బిసి జాబితాలో చేరుస్తామన్న హామీని స్పష్టంగా ఇచ్చామన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఎన్నికల బహిరంగ సభల్లో ఇదే హామీని ప్రకటించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే వెంటనే బిసిల్లో చేర్చేవారమన్నారు. ప్రస్తుతం బిసి జాబితాలో ఉన్న వెనుకబడిన కులాల హక్కులకు ఏ మాత్రం భంగంకలుగకుండా కాపులను బిసిల్లో చేర్చాలన్నదే తమ ఉద్దేశ్యమని రఘువీరా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బిసిల హక్కులకు ఏ మాత్రం భంగం కలిగినా బిసి సామాజికవర్గానికి చెందిన తానే ముందుగా ఉద్యమిస్తానన్నారు. కాపు కులాన్ని షెడ్యూల్ 9లో చేర్చి, బిసి జాబితాలో చేరిస్తే అదనంగా రిజర్వేషన్లు వస్తాయని, దీనివల్ల ఇతర బిసి కులాలకు నష్టం ఉండదన్నారు. అందువల్ల బిసిలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ 18నెలలు గడిచినా కాపులను ఎందుకు బిసిల్లో చేర్చటం లేదో అర్ధంకావటం లేదన్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. 1994లో ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసినపుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిఒ నెం.30ని జారీచేసిందని, దాని ప్రకారం కాపు విద్యార్ధులకు ఆర్థిక సహాయం అందిందన్నారు. ఆ జిఒ ప్రకారమే పుట్టుస్వామి కమిషన్‌ను నియమిస్తే, ఆ కమిషన్ నివేదికను బయటపెట్టకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. ఇపుడు కొత్తగా కమిషన్‌వేసి, కాలయాపన చేయకుండా, పుట్టుస్వామి కమిషన్ నివేదికను ఆమోదించి, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానంచేసి, బడ్జెట్ సమావేశాలలోపు పార్లమెంటు ముందుకు వచ్చేలా రాష్ట్రప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడానికి తమ నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపిలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజ్యసభలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదిస్తుందన్నారు. చంద్రబాబుకు కాపులను బిసిల్లో చేర్చడం ఇష్టం లేదని, అందువల్లే 18నెలలు గడిచినా కనీసం స్పందించటం లేదని, ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించి, కేవలం రూ.100కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రెండేళ్లకు రూ.2వేల కోట్లు ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సదస్సుకు డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతవహించారు.