రాష్ట్రీయం

‘సాగు’ కాస్త జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31 : జూన్ మొదటి పక్షంలో విత్తనాలు వేయాలని ఆశపడిన తెలుగు రాష్ట్రాల రైతులకు నిరాశే మిగిలింది. రుతుపవనాలు సకాలంలో (జూన్ 10 కి కాస్త అటుఇటుగా) వస్తాయని ప్రచారం జరగడంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఇటు తెలంగాణ ప్రభుత్వం విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేశాయి. తెలంగాణలో 105 లక్షల ఎకరాల్లో, ఏపిలో 120 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. ఇందులో కేవలం వరి పంట విస్తీర్ణం 75 వేల ఎకరాలు ఉంటుంది. వర్షాలు బాగా పడి పెద్ద జలాశయాల (నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం తదితర ప్రాజెక్టులు)తో పాటు మధ్యతరహా జలాశయాలు, చెరువులు, కుంటలు నిండితే వరి సాగవుతుంది. రెండు రాష్ట్రాల్లోని బావులు, బోరు బావుల కింద 30 నుండి 40 వేల ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం నీళ్లున్న బోరు బావుల కింద రైతులు పంటలు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 20 వేల బోరు బావులు నడుస్తున్నాయి. వీటి కింద వరితో పాటు కాయగూరలు, పశుగ్రాసం, వేరుశనగ తదితర పంటలు వేస్తున్నారు.
కేవలం వర్షాల మీదే ఆధారపడ్డ భూములు 110 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. తొలకరి పలకరిస్తే దుక్కి దునే్నందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్నప్పటికీ అవి రుతుపవన వర్షాలు కాకపోవడంతో విత్తనాలు వేసేందుకు ఉపయోగపడటం లేదు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిస్తే జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, పత్తి (వర్షాధార), ఆముదం, కందులు, పెసలు తదితర విత్తనాలను రైతులు సిద్ధంగా ఉంచుకున్నారు. వర్షాలు ప్రారంభం కాగానే విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.2016-17 సంవత్సరానికి సేద్యానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో మాట్లాడుతూ, ఒకవైపు బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించేందుకు ఇటీవలే ఎస్‌ఎల్‌బిసి సమావేశం ఏర్పాటు చేసి, ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మరోవైపు ప్రాథమిక సహకార సంస్థల (పిఎసిఎస్) ద్వారా విత్తనాలు, ఎరువులు సరఫరా చేశామని వివరించారు. ఎరువులు, క్రిమి సంహారక మందులకు ఎలాంటి కొదవ లేదని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రైతులతో వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన అధికారులు చర్చించారని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించామని చెప్పారు. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించగానే విత్తనాలు వేయడం ప్రారంభవుతుందని, ఇప్పటికే బావులు, బోరు బావుల కింద సాగు ప్రారంభమైందని తెలిపారు.