రాష్ట్రీయం

అందరికీ వైద్యం.. అదే నా ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 2: ఎక్కువ ఖర్చుతో కూడుకున్న డయాలసిస్ వైద్య సేవలను నిరుపేదలకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో పది యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిఎంఎస్‌ఎస్‌వై గ్రాంట్ కింద వచ్చిన 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఏ దేశంలో విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఆ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైద్య రంగంలో కొత్త విధానాలను తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించగలుగుతున్నామని అన్నారు. కొత్తగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 240 పడకలకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేటు సెక్టారులో వైద్య వృత్తి భ్రష్టు పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకేలా ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలను, వైద్య పరీక్షలను అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య పరీక్ష సేవలను అందిండంతో పాటు పరికరాల నిర్వహణకు వినూత్నపైన విధానానికి శ్రీకారం చుట్టింది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు చెప్పారు. గత నాలుగు నెలల్లో 33 లక్షల మేర నిరుపేదలకు వైద్య పరీక్ష జరిపామని తెలిపారు. వైద్యుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్ష సమయంలోనే వైద్య శాఖలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవన్న మాట రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

చిత్రం విజయవాడలో ఓ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న చంద్రబాబు