రాష్ట్రీయం

లొల్లి ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: రెండు రాష్ట్రాలు బాగుపడే విధంగా సామరస్యంతో ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చునని, ఇరు రాష్ట్రాల రైతులకు మేలు జరిగేట్టు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐసిసిలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులు బహూకరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల నిపుణులతో సమావేశమైన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారనీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కర్నాటక, మహారాష్టత్రో జల వివాదాలు ఉండేవని కానీ ఇప్పుడు సామరస్య పూర్వకంగా చర్చించుకుని పరస్పరం సహకరించుకుంటున్నామని చెప్పారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు మంచిది కాదన్నారు. విజ్ఞతతో వ్యవహరించి ఉభయ రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులు రెండింటిలో 3858 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు. అన్ని రకాలుగా తెలంగాణ, ఆంధ్రకు 4200 టిఎంసిల నీళ్లు అందుబాటులో ఉంటాయని, ఆ నీళ్లతో రెండు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని ముఖ్యమంత్రి తెలిపారు. వివాదాలు వద్దు సామరస్యంగా చర్చించుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం చెప్పినట్టు తెలిపారు.
జిల్లాకు 15 లక్షల జనాభా ఉండే విధంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల సంఖ్య ఎక్కువ ఉండి ఎక్కువ మందికి కలెక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు. జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం జిల్లా కలెక్టర్ వద్ద ఉంటుందని, దీనివల్ల ఎవరికైనా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నా వారికి ఏ పథకం కింద మేలు చేయవచ్చునో జిల్లా కలెక్టర్ నిర్ణయించే అవకాశం ఉంటుందని చెప్పారు.
నిధులు మనవే.. నియామకాలు మనవే
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో మన నిధులు మనమే వ్యయం చేసుకుంటున్నామని, నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. నీటి సమస్య కూడా తీరుతుందని అన్నారు. తెలంగాణలో పేదరికంపై యుద్ధం ప్రకటించామని, పేదలు లేని తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు జాతీయ వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. 2019-20 సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్ ఐదులక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగితే 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదులక్షల కోట్లకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించి, అభివృద్ధి కోసం మీ సలహాలు కోరాలని గవర్నర్ సూచించడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు తనకు పంపించ వచ్చునని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు బాగా పని చేశారని అన్నారు.
కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడు
ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని గవర్నర్ నరసింహన్ కితాబు ఇచ్చారు. ఎంతో సమర్ధవంతంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఆషామాషి కార్యక్రమం కాదని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించే అద్భుమైన పథకమని గవర్నర్ కొనియాడారు.
అమరవీరుల స్మారక నిర్మాణం
తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ భవనం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం మాత్రమే ఉంది. కొత్తగా నిర్మించబోయే స్మారక నిర్మాణం అనేక హంగులు కలిగి ఉంటుంది.

చిత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు