రాష్ట్రీయం

నవనిర్మాణ దీక్షలో ఉరకలెత్తిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 2: ఉత్తరాంధ్రలో గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్ష ఉరకలెత్తిన ఉత్సాహం మధ్య జరిగింది. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపి కె.హరిబాబు, ఎమ్మెల్సీ మూర్తి మాట్లాడుతూ విభజన వల్ల కలిగిన బాధ పడకుండా రెట్టింపు కసితో, ఉత్సాహంతో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విజయనగరంలో...
విజయనగరం: జిల్లాకేంద్రంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి మృణాళిని, జడ్పీ చైర్మన్ స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎం నాయక్, ఎస్పీ కాళిదాసు, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు హాజరై రాష్ట్భ్రావృద్ధికి పునరంకితం అవుతామని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేసారు.
శ్రీకాకుళంలో...
శ్రీకాకుళం: రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్షలో కార్యక్రమంలో ముందుగా ఎపీ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి అచ్చెన్న పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు.